గుంటూరు

రాష్టస్థ్రాయి పోటీలకు లిఫ్టర్ల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 3: కృష్ణాజిల్లా నందిగామలో ఈనెల 16,17 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ 2016, బెంచిప్రెస్ పోటీలకు ఆదివారం మంగళగిరిలోని హెల్త్‌జిమ్‌లో జిల్లా పవర్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన రాష్టస్థ్రాయి పోటీల్లో పాల్గొనే లిఫ్టర్లను ఎంపిక చేసి వివరాలను అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు వెల్లడించారు. మహిళాజట్టులో జి సాయిరేవతి (తెనాలి), ఎం సలోమి (మంగళగిరి), ఎస్‌కె నగీనా (మంగళగి రి), జి సుప్రియ (తెనాలి), చంద్రిక (మంగళగిరి) ఎంపికయ్యారు. పురుషుల జట్టులో 59 కేజీల విభాగంలో షేక్ మహమ్మద్ గౌస్, 66 కేజీల విభాగంలో సిహెచ్ కేశవగోపి, ఆర్ గోపీకృష్ణ, 74 కేజీల విభాగం లో ఎ పవన్‌కుమార్, ఎస్ ఉమాశంకర్, టి గోపీనాధ్, 83 కేజీల విభాగంలో డి నితిన్ నాయక్, ఎం ప్రసన్నకుమార్, 93 కేజీల విభాగంలో శివరామ కిరణ్‌రాజు, పి ఫణీంద్ర, 105 కేజీల విభాగంలో పి సాయిప్రకాష్, 120 కేజీల విభాగంలో జొన్నాదుల ఈశ్వరకుమార్, బెంచిప్రెస్‌లో ఆర్ రాజు (సత్తెనపల్లి), పి సురేష్ (సత్తెనపల్లి), మస్తాన్‌వలి (గుంటూరు) ఎంపికయ్యారని పుల్లేశ్వరరావు తెలిపారు. టీం కోచ్ , మేనేజర్లుగా ఎన్ శేషగిరిరావు, ఎండి ఖుమురుద్దీన్, కెవి భాస్కర్ వ్యవహరిస్తారని పుల్లేశ్వరరావు తెలిపారు.