గుంటూరు

ప్రతి పేదవానికీ ఉచిత వైద్యసేవే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట, జూలై 3: ప్రతి పేదవానికి తన వంతు ఉచిత వైద్య సేవలు అందించాలనే ధ్యేయంతో పలు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో మణిపాల్ ఆసుపత్రి, స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోకాళ్లు, కీళ్ల నొప్పుల వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వైద్యం అందించడానికి పలు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ మాట్లాడుతూ పేదవారికి సేవ చేయాలనే తలంపుతో కీళ్ల, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారికి మంత్రి పుల్లారావు ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమాలశెట్టి రామానుజయ మాట్లాడుతూ మంత్రి పుల్లారావు 23 వైద్య శిబిరాలు నిర్వహించి ఎంతో ఖరీదైన మందులను ఉ చితంగా అందించడం ఆదర్శనీయమన్నారు. రాష్ట్రంలోనే అధికంగా దొంగతనానికి గురైన బంగారాన్ని రికవరీ చేసి న రూరల్ ఎస్‌పి నారాయణ నాయక్, చిలకలూరిపేట అర్బన్ సిఐ సురేష్‌బాబులను మంత్రి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రీ్ధర్ తదితరులు ఘనంగా సన్మానించారు. ధనలక్ష్మి సంస్థల డైరెక్టర్ పేర్ని వీరనారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి, మార్కెట్‌యార్డు చైర్మన్ నెల్లూరి సదాశివరావు, మణిపాల్ ఆసుపత్రి వైద్యులు, మద్ది లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.