గుంటూరు

వెలగపూడికి బస్ సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, జూలై 3: రాష్ట్ర రాజధాని వెలగపూడికి పొన్నూరు డిపో నుండి ప్రతిరోజూ రెండు బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రమేష్‌బాబు, ఎస్‌టిఐ శ్రీనివాసరావు ఆదివారం విలేఖర్లకు తెలిపారు. రాష్ట్ర రాజధాని సందర్శనార్ధం వెళ్లే ప్రయాణికుల కోసం, ఉద్యోగుల ప్రయాణార్ధం ఈ బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పొన్నూరు డిపో నుండి ప్రతిరోజూ ఉదయం 7.15 గంటలకు బస్సు బయలుదేరి గుంటూరు, మంగళగిరి మీదుగా 10 గంటలకు వెలగపూడి చేరుకుంటుందన్నారు. మధ్యాహ్నం 1.30కు బస్సు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు వెలగపూడి చేరుకుంటుందన్నారు.