గుంటూరు

రెండేళ్లల్లో రూ.6 కోట్లతో మంగళగిరి అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 3: గడిచిన రెండేళ్లల్లో మంగళగిరి పట్టణంలో 6 కోట్ల రూపాయలు వెచ్చించి సిమెంటురోడ్లు, డ్రైనేజీలు, వాటర్ పైపులైన్లు నిర్మించామని మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీ వి వెల్లడించారు. మున్సిపల్ పాలకవ ర్గం ఏర్పడి ఆదివారానికి రెండేళ్లు పూ రె్తైన సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో అఖిలపక్ష కౌన్సిలర్లతో కలిసి సమావేశమయ్యారు. కౌన్సిల్ హాలు లో ఏర్పాటుచేసిన కేక్‌ను కట్‌చేశారు. చైర్మన్, కౌన్సిలర్లు, సిబ్బంది పరస్పరం స్వీట్లు తినిపించుకుని ఆనందంతో గడిపారు. చిరంజీవి మాట్లాడుతూ 19 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు తీర్మానం చేశామని, 6 కోట్ల రూపాయల విలువైనవి పూర్తిచేశామన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతు చేనేత పెన్షన్లు 800 మందికి ఇచ్చినట్టు, 50 లక్షల రూపాయలతో 10 బోర్లను ఏర్పాటుచేసి నీటికొరత లేకుండా చేశామన్నారు. వివిధ వార్డుల్లో నీటి అవసరాల కోసం 40 బోర్ల నిర్మాణం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమిషనర్ టీవీ రంగారావు, డీఈ బ్రహ్మానందం, కౌన్సిలర్లు బట్టు చిదానంద శాస్ర్తీ, జంజనం శ్రీనివాసరావు, గోలి శ్రీనివాసరావు, మండ్రు రమాదేవి, నల్లగొర్ల బుల్లబ్బాయి, ఉయ్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.