గుంటూరు

కాదేదీ కబ్జాకు.. అనర్హం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 3: కాదేదీ కబ్జాకు అనర్హం అనే చందంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు భూ దందాకు తెరలేపుతున్నారు. ప్రభుత్వ అసైన్డు, పోరంబోకు భూములు ఇప్పటికే దాదాపు కుటుంబ సభ్యులు.. తమ పేరిట రెగ్యులరైజ్ చేసుకున్న నాయకులు లేకపోలేదు. అధికార పార్టీ నేతలు ఓ అడుగు ముందుకేసి ఏకంగా పార్టీ కార్యాలయాలకు నిషేధిత భూములను ఆక్రమించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. టీడీపి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి మంగళగిరి మండలం ఆత్మకూరులో నిషేధిత వాగు పోరంబోకు భూమి (సర్వే నెంబరు 392) 3 ఎకరాల 78 సెంట్లు కట్టబెట్టేందుకు రికార్డులు రెడీ అయ్యాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి కేటాయించిన భూమికి మించి జిల్లాకు చెందిన ఓ మంత్రి తన నియోజకవర్గ పార్టీ కార్యాలయానికి నాలుగెకరాల భూమికి టెండర్ పెట్టినట్లు తెలియవచ్చింది. అంతేకాదు ఇదే ప్రాంతంలో ఓ కళ్యాణ మండపం నిర్మాణానికి 40 ఎకరాల భూమిని పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు సమాచారం. తిలా పాపం తలా పిడికెడు చందంగా భూముల వ్యవహారంలో పార్టీల కతీతంగా నేతలు ఏకం కావడం విశేషం. గుంటూరు నగరంలోగల ఓ వెయ్యిగజాల స్థలంలోని భవంతితో సహా ఆక్రమించుకునేందుకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఓ మాజీ మంత్రి అనుచరులుగా చెప్పుకుంటున్న కబ్జాదారుడిపై పోలీసులు పీడి యాక్టు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా శ్రీనివాసరావుతోట ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో భవనాలు వెలిశాయి. బ్రాడీపేట ప్రాంతంలో ఓ ఇల్లు కబ్జా చేసేందుకు నేతలు ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. ఈ వ్యవహారంలో మావోయిస్టుల పేరుతో కూడా దందా నడుపుతున్నట్లు సమాచారం. రేపల్లె, బాపట్ల, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున భూముల పందారం జరుగుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ భూములు పరాధీనమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పదివేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఉన్నట్లు చెప్తున్నారు. కొనే్నళ్ల కిందటే ఆక్రమణదారులకు నోటీసులు జారీచేసిన అధికారులు వౌనం వహిస్తున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. మంగళగిరి ప్రాంతంలో భూ కబ్జాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యే సారధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో అధికార పార్టీదే అందెవేసిన చేయిగా మారినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా భూముల రికార్డులను తారుమారు చేయటంలో కొందరు రెవిన్యూ, మునిసిపల్ అధికారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గోరంట్ల, నల్లపాడు రోడ్డులో వక్ఫ్ బోర్డు, ప్రభుత్వ భూములు వందల ఎకరాలు చేతులు మారాయి.. గుంటూరు-మంగళగిరి రోడ్డులో వాసవీ కాంప్లెక్స్ సమీపంలోని ప్రభుత్వ, వక్ఫ్ భూములను నేతలు ఇప్పటికే స్వాహా చేశారు. రాజధాని నేపథ్యంలో అధికారిక కబ్జాకు అంతులేకుండా పోతోందనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. దీనిపై రెవిన్యూ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.