గుంటూరు

కనులపండువగా ఉరుసు మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 4: పెదకాకాని బాజీబాబా 528వ ఉరుసు మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం గంధం ఊరేగింపు కార్యక్రమంతో ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎపి స్టేట్ వక్ఫ్‌బోర్డు సహాయ కార్యదర్శి షేక్ అహ్మద్, ప్రత్యేక అధికారి నూర్, కాకాని తహశీల్దార్ల పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదటిసారిగా వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో రూ. 5 లక్షల రూపాయలతో 100 లారీల మట్టితో దర్గా పరిసర ప్రాంతాల్లో మెరక వేశారు. ఇవికాక 7 లక్షల రూపాయలను ఉరుసు ఉత్సవాలకు మంజూరు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్ధం వాటర్‌ప్రూఫ్ టెంట్‌లు, తాగునీరు ఇతర వసతి సదుపాయాలను రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా సిసి కెమేరాలను ఏర్పాటు చేశారు. బాజీబాబా గ్రహదోషాల నుంచి విముక్తి కల్పించారనేది భక్తుల నమ్మకం. మంగళవారం దీపారాధనతో కార్యక్రమం జరుగుతుంది. సాధారణ రోజుల్లో కంటే రంజాన్ మాసం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కుబడులు తీర్చుకుంటున్నారు.