గుంటూరు

అథ్లెటిక్స్ అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (స్పోర్ట్స్), జూలై 4: జిల్లాలో అథ్లెటిక్స్‌కు ప్రత్యేకస్థానం ఉందని, అథ్లెటిక్స్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని బాస్కెట్‌బాల్ జాతీయ క్రీడాకారుడు, వ్యాపారవేత్త కొర్రపోలు శ్రీనివాసరావు అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోస్థానిక బిఆర్ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన జిల్లా అథ్లెటిక్స్ అండర్ 14, 16 బాలబాలికల ఎంపికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరులో అనేకజాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించామని, అనేక మంది క్రీడాకారులు గుంటూరు నుండి రాష్ట్ర, జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించారన్నారు. సంఘ కార్యదర్శి జి శేషయ్య మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి దాదాపు 300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని, చిలకలూరిపేట, నగరం, ఖాజీపాలెం, నరసరావుపేట, తెనాలి, బాపట్ల నుండి అత్యధిక సంఖ్యలో క్రీడాకారులు పోటీల్లో పాల్గొనడం విశేషమన్నారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిజె కిషోర్, డాక్టర్ విజయకుమారి, అథ్లెటిక్స్ శిక్షకురాలు రమాసుందరి, టెక్నికల్ అఫిషియల్ జివిఎస్ ప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజు, శరత్, గౌస్‌బేగ్ తదితరులు పాల్గొన్నారు.