గుంటూరు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, జూలై 4: మండలంలోని చీగటీగలపాలెం జంక్షన్ వద్ద సోమవారం ఎదురెదురుగా వస్తున్న గూడ్సు ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో నూజండ్ల మండలంలోని చెరుకుంపాలెం గ్రామానికి చెందిన కానాల పెద్దిరెడ్డి (65) అక్కడి కక్కడే మృతి చెందగా, దగ్గుపాటి శివన్నారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనంపై పెద్దిరెడ్డి, శివన్నారాయలో వినుకొండకు వస్తుండగా, అదే మండలంలోని జడ్డావారిపాలెం నుండి వినుకొండ వైపు వస్తున్న నాలుగచక్రాల ఆటో ఒకదానికి ఒకటి ఢీకొనడంతో మోటారుసైకిల్‌పై ప్రయాణిస్తున్న పెద్దిరెడ్డి అక్కడి కక్కడే మృతి చెందగా, శివన్నారాయణ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 వాహనంలో క్షతగాత్రుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జిజిహెచ్‌కి తరలించారు. పెద్దిరెడ్డి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. వినుకొండ ఎస్‌ఐ జీవీ నారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.