గుంటూరు

కమిషనర్ ఆదేశాలు బేఖాతరు - కొత్తగా వెలసిన ఫ్లెక్సీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 4: పట్టణంలో విచ్చల విడిగా అనుమతి లేకుండా వెలుస్తున్న ఫ్లెక్సీలపై గత గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అధికారులపై మండిపడింది. దీంతో అనుమతి లేకుండా కట్టిన ఫ్లెక్సీలు ఈనెల 2వ తేదీలోపు స్వచ్చందంగా తొలగించాలని, ఆ తరువాత ఉండే ఫ్లెక్సీలు కట్టిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, జరిమానా విధించి ప్రాసిక్యూట్ చేస్తామని కమిషనర్ మీడియా ద్వారా చేసిన హెచ్చరికలు పట్టణంలో ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. కమిషనర్ చేసిన ప్రకటన తరువాత రంజాన్ శుభాకాంక్షలంటూ ఫ్లెక్సీలు ముద్రించి చిన్నా పెద్దా నేతలతో ఫ్లెక్సీలు ఊరంతా వెలిశాయి. ఫ్లెక్సీల్లో అధికార పార్టీకి చెందిన నేతలవే ఎక్కువగా ఉండటంతో ఫ్లెక్సీలు తొలగించే విషయంలో కమిషనర్ గానీ, సిబ్బందిగానీ ఎటువంటి చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు. అధికారుల ఆదేశాలు, కౌన్సిల్ తీర్మానాలు ఫ్లెక్సీల విషయంలో అపహాస్యం పాలయింది. కట్టిన ఫ్లెక్సీలు నెలల తరబడి పట్టణ ప్రధాన వీధుల్లోను, డివైడర్ మధ్యభాగంలో ఉన్న విద్యుత్ స్తంభాలకు వేలాడుతూనే ఉండటంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది. రంజాన్ పండుగ సందర్భంగా కట్టిన ఫ్లెక్సీల జోలికెళితే మైనార్టీల విషయంలో ఏ రకమైన ఇబ్బందులు తలెత్తుతాయోనని అధికారులు కొంత మధన పడుతున్నారు. పట్టణంలో విచ్చల విడిగా వెలుస్తున్న ఫ్లెక్సీల విషయంలో అధికార యంత్రాంగం రాజకీయాల కతీతంగా నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు.