గుంటూరు

స్పిన్నింగ్ మిల్లులను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 4: రాష్టవ్య్రాప్తంగా సంక్షోభంలో కూరుకుపోయిన స్పిన్నింగ్ మిల్లుల వ్యాపారులను ఆదుకోవాలని ఎపి కాటన్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. రెండేళ్లుగా టెక్స్‌టైల్ పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోయిందని, చైనా, యూరోపియన్ దేశాల్లో ఆర్థిక సంక్షోభం వల్ల ఎగుమతులు నిలిచిపోయాయని, దీంతో దేశంలో నూలు నిల్వలు పేరుకుపోయి గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని సంఘ ప్రతినిధులు వివరించారు. గుజరాత్, మహారాష్టల్రలో టెక్స్‌టైల్ పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలు కూడా రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లుల మనుగడకు విఘాతంగా మారిందన్నారు. ప్రభుత్వం నుంచి రూ.1500 కోట్ల మేర రాయితీలు నిలిచిపోయాయని, వీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరులో వ్యాపారులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈసందర్భంగా ఎపి కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కె పున్నయ్య చౌదరి మాట్లాడుతూ పత్తి విస్తీర్ణంలో 75శాతం తెలంగాణ ప్రాంతంలో, 25శాతం మన రాష్ట్రంలో ఉంటే స్పిన్నింగ్ మిల్లులు 25శాతం తెలంగాణలో, మరో 75శాతం ఎపిలో ఆధారపడి ఉన్నాయని తెలిపారు. కిలోకు రూ.6 నుంచి 7 వరకు అధిక మొత్తంలో చెల్లించి తెలంగాణ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, దీనివల్ల 2 శాతం అదనపు పన్ను భారం కూడా మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎపిలో 5 లక్షల మంది కార్మికులు 120 స్పిన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్నారని, ఆదాయ, సర్వీస్ ట్యాక్స్ ద్వారా వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోందని, ఈ పరిస్థితుల్లో వ్యాట్ తిరిగి చెల్లించి, రాయితీ బకాయిలను విడుదల చేస్తేతప్ప మనుగడ లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4 స్పిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయన్నారు. 2005-10 సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన విధానంతో ఆర్థిక పరిపుష్టి పొందిన స్పిన్నింగ్ మిల్లులు ఆతర్వాత ఐదేళ్లలో అపారంగా నష్టాల్లో కూరుకుపోయాయని వివరించారు. కార్పొరేట్, బహుళజాతి కంపెనీల ప్రమేయంతో ఒక్కసారిగా పత్తి క్యాండీ ధర రూ.13 వేలకు పైగా అదనంగా చెల్లించాల్సి వస్తోందని, నూలు ధరలు పెంచకుండా కేవలం పత్తి ధరను పెంచడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. సిసిఐ అధికారుల నిర్వాకం వల్లే తాము నష్టాల ఊబిలో కూరుకుపోవాల్సి వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణమే స్పందించాలని పున్నయ్య చౌదరి కోరారు.