గుంటూరు

ఆటోబోల్తా: పలువురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చెంపేట, జూలై 7: మండలంలోని కొత్తపల్లి-అచ్చెంపేట గ్రామాల నడుమ గురువారం ఆటోబోల్తా పడిన సంఘటనలో పెను ప్రమాదం తప్పి, ప్రయాణీకులు కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. కొండూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పి ప్రసాద్ పుట్లగూడెంలో ఉన్న తన భార్యను తీసుకుని రావడానికి వెళ్ళి వస్తూ చింతపల్లి వద్ద ప్రయాణికులు ఉండడంతో వారిని ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆటో కొత్తపల్లి దాటి అచ్చెంపేట సరిహద్దులకు చేరుకున్న వెంటనే అదుపుతప్పి బొల్తా కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిని అచ్చెంపేట ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.