గుంటూరు

తెలుగువాళ్లం ఎక్కడున్నా ఒక్కటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జూలై 7: అనివార్య పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయినప్పటికీ, భౌగోళిక బంధం తెలుగువారందరి అనుబంధానికి ఎప్పుడూ అడ్డురాదని సాంస్కృతిక, సారస్వత సంబంధాలే మిన్న అని తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుడు, విశ్రాంత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కెవి రమణాచారి అన్నారు. గురువారం ఆయన హిందూ కళాశాల ఎడి హాలులో కనులపండువగా జరిగిన సభలో డాక్టర్ ప్రసాదరాయ కులపతి పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా తనకు జరిగిన సత్కారానికి రమణ కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిస్పందింస్తూ ఆధ్యాత్మిక శక్తి సమన్వితుడు, పూర్వాశ్రమంలో ఆశుకవితానిధిగా పేరుగాంచిన డాక్టర్ కులపతి, కుర్తాళం పీఠాధిపతి తన పట్ల ఆవ్యాజానురాగమైన ప్రేమతో పురస్కారానికి ఎంపిక చేసి గౌరవించటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సరస్వతీ పుత్రుల నిలయమైన హిందూ కళాశాలకు రాష్ట్రంలోనే గాకుండా దేశంలోనే జాతీయతకు సంకేతంగా నిలిచిన విద్యాసంస్థగా పేరుందన్నారు. ఈ కళాశాలలో చదువుకోవడం ఒక వరమైతే ఇక్కడ ఆచార్యులుగా వ్యవహరించిన అధ్యాపకులంతా పరిణితి చెందిన వారు కావడం ఎంతో విశేషమన్నారు. విద్యార్థులంతా మానవీయ విలువలను పెంపొందించుకోవాలని, దేశభక్తి, త్యాగనిరతి, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించుకుంటూ తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలను కనబరుస్తూ దేశ పురోభివృద్ధికి తమ శక్తియుక్తులను ధార పోయాలని రమణాచారి పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల పాలకమండలి అధ్యక్షుడు ఎస్‌విఎస్ సోమయాజి, అభినందనలు తెలిపిన డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు, పాలకమండలి కార్యదర్శి ఎమ్‌విఆర్‌కె ముత్యాలు, అదనపుకార్యదర్శి జివైఎన్ బాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె కనకదుర్గ, కులపతి విద్యాపురస్కారాలు అందుకున్న డాక్టర్ కె కాళిదాసు, డాక్టర్ ఎస్‌కె హుస్సేన్ రమణాచారి పాలనాదక్షతను కొనియాడారు. సభలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, సీనియర్ న్యాయవాది జూపూడి రంగరాజు, అనేకమంది సాహిత్యవేత్తలు, రంగస్థల నటులు పాల్గొని రమణాచారిని పుష్పమాలలతో ఘనంగా సత్కరించారు.