గుంటూరు

సాంస్కృతిక శిఖరం డాక్టర్ రమణాచారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు(కల్చరల్), జూలై 7: సీనియర్ ఐఎఎస్ అధికారిగానే గాకుండా ఓ తెలుగువాడిగా సాహిత్య, సారస్వత, సాంస్కృతిక రంగాలకు నిరుపమానమైన సేవలందించిన డాక్టర్ కెవి రమణాచారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి సాంస్కృతిక శిఖరమని ప్రెస్ అకాడమీ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావుప్రశంసించారు. గురువారం ఉదయం గుంటూరు నగరంలోని హిందూ కళాశాల ఏకాదండ పంతులు హాలులో డాక్టర్ రమణాచారికి ఈ ఏడాది డాక్టర్ ప్రసాదరాయ కులపతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆ కళాశాల పాలకమండలి అధ్యక్షుడు ఎస్‌విఎస్ సోమయాజి అధ్యక్షత వహించారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఇవోగా నియమితులై, ఆ దేవస్థానాన్ని కోట్లాది మంది భక్తులకు చేరువచేసిన ఘనత రమణకే దక్కిందన్నారు. కులీకుతుబ్‌షా సంస్థ ఎండిగా పాతబస్తీ ప్రజల మన్ననలును కూడా రమణాచారి అందుకున్నారన్నారు. ఇంతటి గొప్ప వ్యక్తికి హిందూ కళాశాలలో ఏర్పాటు చేసిన కులపతి పురస్కారాన్ని అందించడం విశేషమైన గౌరవమన్నారు. అనుగ్రహ భాషణ చేసిన కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతిస్వామి రమణాచారి మానవీయ విలువలు కలిగిన సమున్నత వ్యక్తి అని కొనియాడారు. ఏ పదవిలో ఉన్నా ధర్మ పరిరక్షణ కోసం శ్రమించారన్నారు. కార్యక్రమంలో పాలకమండలి కార్యదర్శి ఎమ్‌విఆర్‌కె ముత్యాలు, అదనపుకార్యదర్శి జివైఎన్ బాబు, ప్రిన్సిపాల్ కె కనకదుర్గ కూడా రమణాచారి సేవలను ప్రశంసించారు.