గుంటూరు

అధునాతన టెక్నాలజీతో నేర నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 7: అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ జెవి రాముడు తెలిపారు. కృష్ణాపుష్కరాల ఏర్పాట్లలో భాగంగా గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో డీజీపి కంట్రోల్ రూమును ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపి మాట్లాడుతూ పుష్కరాల బందోబస్తుకు 12వేల మంది సిబ్బందిని నియమించనున్నట్లు చెప్పారు. ఈ నెల 25 లోగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పుష్కర ఘాట్లు, రోడ్ల నిర్మాణాలు పూర్తిచేస్తే ట్రాఫిక్ మళ్లింపుపై దృష్టి సారిస్తామన్నారు. గత గోదావరి పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలీసు శాఖలో ఐకనిక్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని, దీని వినియోగంతో నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. నిందితుల వివరాలను నిక్షిప్తంచేసి రాష్టవ్య్రాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లతో అనుసంధానం చేస్తామన్నారు. ఏదైనా ఓ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదుచేస్తే ముఖ్యమంత్రి, డీజీపి కార్యాలయాలతో పాటు రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లకు సమాచారం అందించేలా సాంకేతిక వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని వివరించారు. ఐజీపీ ఎన్ సంజయ్, గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, రూరల్ ఎస్పీ నాయక్ పాల్గొన్నారు.