గుంటూరు

హోదా కోసం మరోమారు దీక్షకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 2: రాష్ట్భ్రావృద్ధి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేకహోదా కేటాయించకుంటే మారోమారు నిరాహారదీక్ష చేసేందుకైనా వెనుకాడేది లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పష్టంచేశారు. మంగళవారం గుంటూరులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రప్రజలు చేస్తున్న ఆందోళనను బట్టి నోరు తెరవాల్సి వచ్చిందన్నారు. విభజన చేసిన వారు మట్టికొట్టుకు పోయారని, విభజనకు సహకరిస్తున్న వారు ఇప్పుడు ప్రజల నోట్లో మట్టికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రప్రభుత్వం పెద్ద కొడుకులా ఉండి ఆదుకోవాల్సింది పోయి ఎపిపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సబబు కాదన్నారు. బీహార్, తమిళనాడు, కోల్‌కత్తా ప్రాంతాలకు కేంద్రం ఉదారంగా సహాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చేసరికి లెక్కలు వేయడం సరికాదన్నారు. కేంద్రం వైఖరి చూస్తుంటే చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి అడ్డుకునే విధంగా బిజెపి వ్యవహరిస్తుందేమోనని అనుమానం కలుగుతుందన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీలతో పాటు హోదా కూడా ఇవ్వాలన్నారు. కేంద్రంతో మిత్రపక్షం స్థానంలో ఉన్నందున హోదా కోసం సామరస్యంగా కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల వైసిపిలో చేరిన పలు పార్టీల నాయకులకు చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. సమావేశంలో ములకా సత్యవాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.