గుంటూరు

సురక్షితమైన మంచినీటిని ప్రజలకు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కార్పొరేషన్), ఆగస్టు 4: గుంటూరు నగర ప్రజలకు శుద్ధిచేసిన సురక్షితమై మంచినీటిని అందించేందుకు అధికారులు కృషి చేయాలని మంచినీటి సరఫరా వ్యవస్థను ప్రత్యేక పర్యవేక్షణ చేసేందుకు నియమించిన టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం కమిటీ సభ్యులైన పబ్లిక్ హెల్త్ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజీనర్ కోటేశ్వరరావు, పి పరంధామయ్య, జోగారావు, రాధాకృష్ణ తదితరులు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నగరానికి మంచినీటిని సరఫరా చేసే తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్‌ను తనిఖీ చేశారు. ఇందులోభాగంగా తక్కెళ్లపాడులోని ముడినీటి శుద్ధి కేంద్రాన్ని, మంచినీటి శుద్ధి కేంద్రాన్ని, క్లారిప్యాక్యూలేటర్ పని విధానాన్ని పరిశీలించారు. మంచినీటిలో ఆలం శాతాన్ని ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులనుద్దేశించి వారు మాట్లాడుతూ మంచినీటిలో ఆలం శాతం తగుపాళ్లలో ఉండేలా చూడాలన్నారు. కొన్నిచోట్ల పైపులైన్లకు మరమ్మతులు ఏర్పడ్డాయని వాటిని వెంటనే మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి సరఫరా వ్యవస్థపై వివిధ అంశాలపై కమిషనర్ నాగలక్ష్మికి తాము నివేదికను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతిరాజు, ఏ ఈలు తదితరులు పాల్గొన్నారు.