గుంటూరు

విగ్రహ ఏర్పాటుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, ఆగస్టు 8: ప్రభుత్వ అమనుమతులు లేకుండా ఆస్తులను ధ్వంసం చేస్తూ విగ్రహాలను పెట్టేవారిపై, అందుకు సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెదకూరపాడు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు. గురువారం ఆయన గడప గడపకు వైసిపి కార్యక్రమంలో భాగంగా నీలేశ్వరపాలెం గ్రామంలో పర్యటించారు. మొదటగా స్థానికంగా విలేఖర్లతో మాట్లాడారు. విజయవాడలో అన్నిశాఖల అనుమతులు తీసుకుని నిర్మించిన వైఎస్‌ఆర్ విగ్రహంతో పాటు ఎన్నో సంవత్సరాల ఘనచరిత్ర గల దేవాలయాలు, మసీదులను ప్రభుత్వం పుష్కరాలు, రహదారుల అభివృద్ధి పేరుతో నేలమట్టం చేస్తూ అమరావతిలో అనుమతులు లేకుండా ఎన్‌టిఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసినా ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈయన వెంట వైసిపి మండల కన్వీనర్ సత్యం, పార్టీ నాయకులు సాయిరెడ్డి, బాబు, చిన్నపరెడ్డి, అంబటి నారాయణ, మర్రెడ్డి, అంతోన్‌రెడ్డి, పి శ్రీనివాసరావు, ఆర్ శ్రీ్ధర్, ఎన్ నీలకంఠం, సాంబిరెడ్డి తదితరులున్నారు.