గుంటూరు

చెరువులకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, ఆగస్టు 29: నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదనీరు చెరువుల్లోకి వచ్చి చేరుతుండడంతో జలకళ సంతరించుకుంది. రెంటపాళ్ళ, గోగులపాడు మధ్యగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఎద్దువాగును స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం పరిశీలించారు. ఆయా గ్రామల్లో చెరువులు నిండుతుండడంతో రైతులు హర్హం వ్యక్తంచేస్తున్నారు. నీరు చెట్టు పథకంలో భాగంగా చెరువుల పూడిక తీయడంతో నీటి నిల్వలు భారీగా పెంచుకోవటానికి దోహదపడిందని కోడెల వివరించారు. స్పీకర్ వెంట మండల పార్టీ అధ్యక్షులు కోమటినేని శ్రీనివాసరావు, మక్కపాటి రామచంద్రరావు, ఆయా గ్రామ రైతులు తదితరులు ఉన్నారు.