గుంటూరు

అంటువ్యాధులపై అవగాహన అవశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 29: జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాధులపై అన్ని ప్రాంతాల్లో ప్రజలకు అవగాహనా సదస్సులు నిర్వహించి వ్యాధి నిర్మూలన చర్యలు చేపట్టాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి వైద్యాధికారులకు సూచించారు. సోమవారం ఎమ్మెల్యే మోదుగుల గుంటూరు ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా మలేరియా, డెంగ్యు జ్వరాలతో పాటు స్క్రబ్ టైపస్ ఫీవర్‌తోప్రజలు పిహెచ్‌సిలకు తరలివెళుతున్నారని, అక్కడ సదుపాయాలులేక జిజిహెచ్‌కు వస్తే అక్కడ కూడా సిబ్బంది స్పందించక పోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన అగత్యం ఏర్పడిందని వివరించారు. పిహెచ్‌సిలలో వైద్య సదుపాయాలు సక్రమంగా అందటంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, దీనిని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వ వైద్యాధికారులపై ఉందన్నారు. జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించి విస్తృతంగా ఉచిత వైద్యశిబిరాలను నిర్వహించి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. మోదుగుల వెంట ఆసుపత్రి సిబ్బంది, పలువురు వైద్యాధికారులు ఉన్నారు.