గుంటూరు

పల్నాడు పోరుకు తాత్కాలిక విరామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాచేపల్లి, ఆగస్టు 29: గురజాల యమ్మేల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల యమ్మేల్యే పినె్నల్లి లక్ష్మారెడ్డిల సవాళ్ళు, ప్రతి సవాళ్ల మధ్య సోమవారం నడికుడి మార్కెట్ యార్డ్‌లో జరగవలసిన బహిరంగ చర్చా వేదికకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో మరో పల్నాటి యుద్ధానికి తాత్కాలిక విరామం ఏర్పడింది. ఇరు పార్టిల నేతలు, కార్యకర్తలు ముఖాముఖి ఎదురుపడితే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని భావించిన పోలీసులు నడికుడి సభకు అనుమతి నిరాకరించారు. ముందు జాగ్రత్త చర్యగా మాచర్ల, గురజాల నియోజకవర్గాలలో పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో పోలీసులు పలువురు వైఎస్ ఆర్‌పి నాయకులను అరెస్టు చేశారు. కాగా నడికుడి సభకు తాత్కాలికంగా విరామం ఏర్పడినప్పటికీ ఏ చర్చా వేదికపైనైనా తాము చర్చకు సిద్ధంగా వున్నామని గురజాల యమ్మేల్యే యరపతినేని, మాచర్ల యమ్మేల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించడం గమనార్హం. కాగా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మాచర్లలో మాచర్ల యమ్మేల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచగా, గుంటూరు నుండి నడికుడి బయలుదేరిన గురజాల యమ్మేల్యే యరపతినేని శ్రీనివాసరావును పిడుగురాళ్ళ వద్ద పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇదిలా వుండగా మాజీ యమ్మేల్యే జంగా జంగా కృష్ణమూర్తి, మాజి యంఎల్‌సి టిజివి కృష్ణారెడ్డి, దాచేపల్లి జడ్‌పిటిసి మూలగొండ్ల ప్రకాష్ రెడ్డిలను మండలంలోని గామాలపాడులో అదుపులోనికి తీసుకున్న పోలీసులు దాచేపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.