గుంటూరు

ఆధునికాంధ్ర భాషా తపస్వి గిడుగు రామ్మూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 29: తెలుగుభాష నిర్ధిష్టత, సమగ్రత, హేతుబద్ధతకు కృషిచేసిన గిడుగు రామ్మూర్తి పంతులు తొలి ఆధునికభాషా శాస్తవ్రేత్తగా అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి అభివర్ణించారు. సోమవారం గిడుగు రామ్మూర్తి జయంతిసభ అవగాహనా సంస్థ కార్యాలయంలో జరిగింది. సభలో సాహితీవేత్త సిహెచ్ సుశీల మాట్లాడుతూ ప్రాచీనకాలంలో తెలుగు వాక్యానికి పునాదివేసిన నన్నయ్య ఎలాగో ఆధునిక కాలంలో తెలుగు భాషకు అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రజల చెంతకు తీసుకువెళ్లేందుకు గిడుగు కృషి చేశారని ప్రస్తుతించారు. రచయిత్రి ఎవికె సుజాత మాట్లాడుతూ గ్రాంధికవాదులు, సాంప్రదాయవాదులను ఎదుర్కొని ఆంధ్రభాషను సామాన్యులకు చేరువ చేయటంలో గిడుగు చేసిన కృషి అద్వితీయమని కొనియాడారు. కవి, గాయకుడు కొణతం నాగేశ్వరరావు మాట్లాడుతూ రామ్మూర్తి తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి భాషాభివృద్ధికి కృషిచేసి 1919లో తెలుగు అనే మాసపత్రికను ఆవిష్కరించి తన శాస్ర్తియ వ్యాసాలు, ఉపన్యాసాలతో అవిశ్రాంత పోరాటం సాగించారని గుర్తుచేశారు. తొలుత గిడుగు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తిరుపతయ్య, ఎస్ మూర్తి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.