గుంటూరు

టీడీపీ నేత దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 30: తెలుగుదేశం పార్టీ బిసిసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు యేమినేని వెంకటేశ్వరరావు(40) దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం వేకువజామున గుంటూరు రూరల్ పరిధిలోని ఓబులనాయుడుపాలెంలో ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తున్న వెంకటేశ్వరరావును గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో నరికారు. రక్తపు మడుగులో పడివున్న వెంకటేశ్వరరావును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా స్థానిక రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరపున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ తగాదాలు, పాతకక్షలు, కుటుంబ కలహాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. గుంటూరు అర్బన్ సౌత్‌జోన్ డిఎస్‌పి బి శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.