గుంటూరు

వరద బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాదెండ్ల, సెప్టెంబర్ 22: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మండలంలోని రెండు రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాల వల్ల కుప్పగంజి వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ వరద బీభత్సం వల్ల అమిన్‌సాహేబ్‌పాలెం గ్రామంలో కుప్పగంజి వాగు పొంగి పొర్లటంతో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఒక వ్యక్తి 20 గంటల పాటు తాటిచెట్టును పట్టుకుని స్థానికుల సహాయంతో బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న హోం మంత్రి చిన రాజప్ప, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అమిన్‌సాహెబ్ పాలెం గ్రామం వద్ద కుప్పగంజి వాగు సమీపంలో కాపలాదారుడుగా పనిచేస్తున్న చేవూరి కొండలు, చేవూరి వనజ, చేవూరి సుబ్బులు ఈ వరదలో గల్లంతయ్యారు. వీరికోసం హెలికాప్టర్‌లో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం శూన్యమైంది. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే కుటుంబం వారు కావడంతో గ్రామంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి. వరదలో చిక్కుకున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి 8 గంటల పాటు వాగు మధ్యలో ఉన్న తాటిచెట్టుకు వేలాడుతూ తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అతని బాబాయి పోలయ్య ఇతనిని కాపాడబోయి వరద వరదలో చిక్కుకున్నాడు. స్థానికులు వెంటనే స్పందించటంతో ఎట్టకేలకు ఇరువురిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. వీరువురిని బయటకు తీసుకొచ్చింనందుకు హోం మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, తాడికొండ ఎమ్మెల్యే, కలెక్టర్ కాంతిలాల్ దండే అభినందించారు. అదేవిధంగా గణపవరం జాతీయ రహదారి పక్కనే ఉన్న టిబి వైద్యశాల నందు నక్కా అంకమ్మరావు, నక్కా రామయ్య, నక్కా వెంకటేశ్వర్లు, పొట్లూరి నాగరాజు, తోట శ్రీనివాసరావు, పి ఏసుబాబు, బి శ్రీనివాసరావులు చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్ రిస్క్ టీం ఘటనా స్థలాన్ని చేరుకుని ఏడుగురిని క్షేమంగా బోట్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు. అదేవిధంగా పక్కనే ఉన్న మరో చర్చిలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోవటంతో వారిని కూడా క్షేమంగా తీసుకొచ్చారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని అన్ని చర్యలు చేపట్టారు. అంతేకాకుండా చిలకలూరిపేట నుండి నరసరావుపేటకు రహదారులు మూసుకుపోవటంతో అటువైపు ఎటువంటి భారీ వాహనాలను పోలీసులు అనుమతించలేదు.