గుంటూరు

కుదిపేసిన కుంభవృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 22: జిల్లాను కుంభవృష్టి కుదిపివేసింది. భారీ వర్షాలకు వ్యవసాయ, ఉద్యానవన పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రసాయనాలు చల్లి పంటలను కాపాడుకునే ఆతృతతో ఉన్న రైతులు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు చేతికి అందివచ్చే పరిస్థితులులేవని లబోదిబో మంటున్నారు. పత్తి, మిర్చి, వరి పంటలకు అపారన సంభవించింది. సుమారు మూడు లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన, వాణిజ్య పంటలు నీట నానుతున్నాయి. జిల్లా మొత్తంగా 4598 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 35 మండలాల్లో 20 శాతం అత్యధికంగా 17 మండలాల్లో 10 నుంచి 25 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయింది. జిల్లాలో గురువారం నమోదయిన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి.
నకరికల్లులో 241.4 మిల్లీ మీటర్లు, నరసరావుపేట 224, మేడికొండూరు 210, మాచవరం 198, బెల్లంకొండ 191, ముప్పాళ్ల 186.4, ఫిరంగిపురం 163.8, సత్తెనపల్లి 161.8, ప్రత్తిపాడు 152.4, వట్టిచెరుకూరు 146.6, నాదెండ్ల 140.6, పెదనందిపాడు 119.2, పిట్టలవానిపాలెం 105.6, రొంపిచర్ల 105, రాజుపాలెం 103, కాకుమాను 103, నగరం 94.2, యడ్లపాడు 90.2, ఈపూరు 80.4, చెరుకుపల్లి 78.6, చిలకలూరిపేట 77.8, అమరావతి 76.6, కర్లపాలెం 75.6, నిజాంపట్నం 69.4, రేపల్లె 68.2, పిడుగురాళ్ల 66.2, అమృతలూరు 62,కొల్లూరు 56.4, బాపట్ల 53.8, చుండూరు 53.6, బొల్లాపల్లి 52.6, క్రోసూరు 50.6, పెదకూరపాడు 50.2, శావల్యాపురం 50, భట్టిప్రోలు 49.2,దాచేపల్లి 48.2, గుంటూరు 45.4, వేమూరు 43.2, గురజాల 42.4, పెదకాకాని 37.8, తాడికొండ 37.2, కొల్లిపర 36.4, మాచర్ల 36, కారంపూడి 35.4, వినుకొండ 34.2, దుర్గి 32, తెనాలి 31.6, తుళ్లూరు 30.4, చేబ్రోలు 29.8, అచ్చంపేట 26.8, దుగ్గిరాల 26.4, నూజెండ్ల 26, మంగళగిరి 20.6, తాడేపల్లి 20.2, రెంటచింతల 11.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గత కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షాలకు తేరుకోక ముందే మరోసారి అల్పపీడనం ధాటికి పంటలు నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సంభవించిన నష్టం అంచనాలే ఇంకా పూర్తికాలేదు. ఇదిలా ఉండగా భారీ వర్షాలకు నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, దాచేపల్లి, నకరికల్లు, నాదెండ్ల, రాజుపాలెం గ్రామాల్లోకి వరదనీరు చేరింది. లోతట్టుప్రాంతాల్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. నరసరావుపేట పట్టణంలో మూడు అడుగుల మేర వరదనీరు ప్రవహించింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా మొత్తంగా సుమారు మూడువేల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వరద పరిస్థితులను డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు సమీక్షిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్‌తో పాటు నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయ, పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ కాంతీలాల్ దండేను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.