గుంటూరు

వరదతో జనజీవనం అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడికొండూరు, సెప్టెంబర్ 22: గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో పలు గ్రామాలను వ రదనీరు చుట్టుముట్టగా... పంట పొ లాలు నీటిలో నానుతున్నాయి. గ్రామ శివారు కాలనీల్లోని గృహాల్లో నీరు ప్రవేశించింది. వరద కారణంగా గుంటూ రు- సత్తెనపల్లి రహదారిలోని మేడికొండూరు వద్ద నూతనంగా నిర్మిస్తున్న రెండు వంతెనల వద్ద తాత్కాలికంగా వేసిన అప్రోచ్ రోడ్లు తీవ్రంగా దెబ్బతిని, గండి పడింది. దీంతో ఈ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న తహశీల్దార్ డి వెంకటేశ్వర్లు, గుంటూరు అర్బన్ డిఎస్‌పి కె శ్రీనివాసరావు, సిఐ బాలాజీ సిబ్బంది, ఆర్‌అండ్‌బి అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రా వణ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యులు గుం టుపల్లి సాంబశివరావు ముంపునకు గురైన ప్రాంతాలు, గండిపడ్డ వంతెన ను పరిశీలించారు. ముంపునకు గురైన కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని, భోజన, వసతి సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లా యి. వేలాది ఎకరాలు వరదనీటిలో మునిగిపోయాయి. దీంతో రైతులు లబోదిబో మంటూ నీటిని బయటకు పంపే పనుల్లో నిమగ్నమయ్యారు. స త్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్ల, పెదకూరపాడు, గుంటూరు తదితర ప్రాంతాలకు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.