గుంటూరు

నకరికల్లులో జనజీవనం అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకరికల్లు, సెప్టెంబర్ 22: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నకరికల్లు మండలం అతలాకుతలమైంది. ఇప్పటివరకు ఇంత వర్షాన్ని చూడలేదని పలువురు తెలిపారు. డివిజన్‌లోనే రికార్డు స్థాయిలో 241.4 మిమీ వర్షపాతం గురువారం ఉదయం 7.30 గంటలకు నమోదైనట్లు తహశీల్దార్ లీలా సంజీవ్‌కుమార్ తెలిపారు. గత 100 సంవత్సరాల నుండి ఇంత భారీ వర్షం కురిసినట్లు దాఖలాలు లేవని పలువురు వృద్ధులు పేర్కొన్నారు. చల్లగుండ్ల, చీమలమర్రి, కండ్లకుంట గ్రామాల్లో చెరువులకు గండ్లు పడ్డాయి. చల్లగుండ్ల చెరువుకి భారీగా గండిపడటంతో గ్రామస్థులు అప్రమత్తమై నీటిని దారి మళ్లించి గ్రామాన్ని రక్షించుకున్నారు. చల్లగుండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీటితో మునిగిపోయింది. అద్దంకి, నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారి నకరికల్లు నందు భారీగా వరదనీరు చేరటంతో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పలుసార్లు బస్సులు, లారీలు వరదనీటిలో ఇర్కుక్కుపోగా పొక్లెయిన్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. నకరికల్లు ఎస్‌ఐ రమేష్ సిబ్బందితో సంఘటనా స్థలాన్ని చేరుకుని వాహనాలను క్రమబద్ధీకరించారు. గుళ్లపల్లి, చాగల్లు, ఎస్‌టి కాలనీల్లోకి నీరు చేరటంతో పునరావాస కేంద్రాలకు తరలించి రెవెన్యూ సిబ్బంది తక్షణ సహాయమందించారు. పలు గ్రామాల్లో విద్యుత్ గత అర్ధరాత్రి నుండి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నకరికల్లు ఫ్లైఓవర్ సమీపంలో ట్రాన్స్‌ఫారం గురువారం నెలకూలింది. విద్యుత్ శాఖ ఎఇ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లోనూ విద్యుత్ పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపడుతున్నామని గురువారం రాత్రికి పూర్తవనున్నట్లు పేర్కొన్నారు. చాగళ్ల గ్రామానికి వెళ్ళేందుకు నరసరావుపేట ఆర్డీవో జి రవీంద్రకు కూడా వరద ప్రభావం తప్పలేదు. మండలంలో వరద బీభత్సాన్ని తెలుసుకున్న నరసరావుపేట ఆర్డీవో రవీంద్ర చాగళ్ల గ్రామానికి వెళ్ళేందుకు నకరికల్లు సిబ్బందితో బయలుదేరారు. చాగళ్ల సమీపంలో రోడ్డు ధ్వంసమై గ్రామానికి వెళ్లే మార్గం లేకపోవటంతో వెనుతిరిగి వచ్చి అవసరమైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవెన్యూ సిబ్బంది ఆదేశించారు.