గుంటూరు

వాగులు, వంకలు ఏకమై ముంచెత్తాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ, సెప్టెంబర్ 22: అల్పపీడన ప్రభావంతో బుధవారం నుండి కురుస్తున్న భారీవర్షాలకు బెల్లంకొండ మండలం చిగురుటాకులా వణికింది. 8 గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు, కుంటలు, చెరువులు కలిసిపోయాయి. ఈ క్రమంలో నాగిరెడ్డిపాలెం, ఊతవాగు, నాగమ్మచెరువు, మనె్నసుల్తాన్‌పాలెం, బంగారు నత్తవాగు, నందిరాజుపాలెం రెడ్డిచెరువు, మాచాయపాలెం పాపయకుంటకు గండ్లు పడ్డాయి. చింతపల్లి మేజర్ కాల్వకు గండి పడటంతో మాచాయపాలెం, ఎస్సీ, ఎస్టీ, బిసి కాలనీల్లోకి వరదనీరు భారీగా చేరింది. రెవెన్యూ, పోలీసు సిబ్బంది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. గడిచిన 40 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని గ్రామస్థులు తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలోకి మూడు అడుగుల మేర నీరుచేరింది. ఎండిఒ ఆఫీసు, పోలీసుస్టేషన్ ప్రాంతాలు చెరువులను తలపించాయి. మండల కేంద్రం నుండి పలు గ్రామాలకు రవాణా సౌకర్యం తెగిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చింతపల్లి మేజర్‌కాల్వకు గండ్లు పడటం వలన మాచాయపాలెం గ్రామంలోకి వరదనీరు వచ్చిచేరింది. గండ్లు పగటిపూట పడటం వలన తక్షణం సహాయక చర్యలు చేపట్టడానికి అవకాశం ఏర్పడిందని, లేని పక్షంలో విపరీతమైన పరిణామాలు చూడాల్సి వచ్చేదని ఎస్‌ఐ శ్రీనివాసరావు అన్నారు.