గుంటూరు

జలదిగ్బంధంలో గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదనందిపాడు, సెప్టెంబర్ 23: నల్లమడవాగు పరివాహక ప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులో వర్షపునీరు పెరగడంతో పలుచోట్ల కరకట్టలకు గండ్లుపడి ఛిన్నాభిన్నమయ్యాయి. దీం తో వందలాది ఎకరాల్లో వేసిన మినుము, ప్రత్తి, మి ర్చి, వరి, మొక్కజొన్న పంటలు వరదనీటిలో కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. అతివృష్టి సమయాల్లో ఎప్పటికప్పుడు దశాబ్దాలుగా పాత కథ పునరావృ తం అవుతుండటంతో ఈ ప్రాంత రైతాంగం పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఇటు గుంటూరు, అటు ప్రకా శం జిల్లా వైపు దాదాపు 20 వేల ఎకరాల్లో వరదనీరు ప్రవహిస్తోంది. కొండపాటూరు, అప్పాపురం, గార్లపాడు, జిల్లెళ్లమూడి, ప్రకాశం జిల్లా పర్చూరు మం డలం పరిధిలో బూచాయపాలెం, చెరుకూరు, ఉప్పరపాలెం, నర్సాయపాలెం గ్రామాలు జలదిగ్బంధం లో చిక్కుకున్నాయి. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గార్లపాడు వద్ద వాగుకు ఇరువైపులా కొండపాటూరు, చెరుకూరు గ్రామాల మధ్య నల్లమడవాగుపై 5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనం గా నిర్మించిన వంతెనను ఆనుకుని నలువైపులా భారీగా గండ్లు పడ్డాయి. అనుకోని రీతిలో ఒక్కసారిగా వరదనీరు గ్రామాల వైపు పరుగిడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బలహీనం గా ఉన్న చోట కట్టలపై మట్టిబస్తాలు వేస్తూ రైతులు జాగారం చేశారు. ఆయినా జరగరాని నష్టం జరిగిపోయింది. ఈ వంతెన వద్ద రెండేళ్ల క్రితం కూడా దక్షి ణం వైపు పడ్డ గండి ఆ ప్రాంత రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఇసుక మేట వేయడంతో బాగు చేసుకునేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించారు. కానీ కథ మరలా మొదటికి రావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాష్ట్రప్రభుత్వం మారడంతో వం తెన నిర్మాణం అంసపూర్తిగా వదిలేయడంతో రైతులకు కడగండ్లు తప్పడం లేదు. ముంపుబారిన గ్రా మాల్లో శుక్రవారం మంత్రి రావెల కిషోర్‌బాబు, హోం మంత్రి చినరాజప్ప, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించి వెళ్లారు. బాధితులకు అక్కడక్కడా బియ్యం పంపిణీ చేయడం తప్ప రైతాంగానికి ఎటువంటి హామీ ఇవ్వక పోవడంతో అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.