గుంటూరు

అభివృద్ధి నిరోధకశక్తి జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 23: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డంకులు సృష్టిస్తూ నిరోధక శక్తిగా మారారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ ధ్వజమెత్తారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హోదాపై విద్యార్థులు, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, పార్లమెంటులో ప్రత్యేకహోదాపై జగన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడి 16 మాసాలు జైలు జీవితం గడిపిన జగన్ తన నేర చరిత్ర గురించి ప్రజలకు చెప్తే బాగుంటుందని ఎద్దేవాచేశారు. జైలు కేసుల నుండి ఉపశమనం పొందేందుకే జగన్ సమావేశాలు పెడుతున్నారన్నారు. తడిగుడ్డతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే రకమని, ఇకనైనా జగన్ క్రిమినల్ ఆలోచనలు మానుకోవాలని హితవుపలికారు. చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్న జగన్ ముందు తన చరిత్ర ఏంటో తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడుపై వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక కేసులు బనాయించారని, చివరకు అవి వీగిపోయాయన్నారు. చంద్రబాబు ఎవరికీ భయపడే వ్యక్తి కాదని, ఆయన నిప్పులాంటి వాడన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి కల్పించిన ప్యాకేజీలను తీసుకుని రాని దాని కోసం క్లిష్టపరిస్థితుల్లో పోరాటం చేయడం ఉత్తమమన్నారు. లక్షా 50 వేల కోట్లు కేంద్ర ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి వస్తుందని, పోలవరం ప్రాజెక్టుకు 32 కోట్లు, వౌలిక సదుపాయాల కోసం వెనకబడిన జిల్లాలకు 2 వేల కోట్లు, కమర్షియల్ కారిడార్స్ కోసం 32 వేల కోట్లు అన్నీ కలిపి లక్షా 50 వేల కోట్లు రాష్ట్రానికి రానున్నాయన్నారు. ఈ ప్యాకేజీ వెనక్కు వెళితే రాష్ట్భ్రావృద్ధి కుంటుపడుతుందని, అందుకే జగన్ హోదా అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ఈ ప్యాకేజీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూనే రావాల్సిన వాటి కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నందున నాయకులు, కార్యకర్తలు పార్టీ పటిష్ఠతను పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.