గుంటూరు

పొంగిపొర్లుతున్న కొండవీటి వాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 23: అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాల మూలంగా అమరావతి-విజయవాడ రహదారిలో పెదమద్దూరు వద్ద గల కొండవీటి వాగు గురువారం రాత్రి నుండి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. విజయవాడ బస్సులు పెదమద్దూరు వరకు వచ్చి వెనుదిరుగుతున్నాయి.
ఈ వాగు పరివాహక ప్రాంతంలో సుమారు 2 వేల ఎకరాలకు పైగా పంటలు నీటమునిగాయి. ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ అధికారులతో కలిసి వాగు ఉద్ధృతిని పరిశీలించారు. వాగులోకి ఎవరూ దిగకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. తహశీల్దార్ కర్లపాలెం శివన్నారాయణమూర్తి, ఎండిఒ రాజగోపాల్, పెనుముచ్చు రామకృష్ణ, టిడిపి నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.