గుంటూరు

మునిగిన పంట పొలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకుమాను, సెప్టెంబర్ 23: భారీవర్షాలు, వరద భీభత్సం కారణంగా పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. 15 వేలపై చిలుకు ఎకరాల్లో వరి, ప్రత్తి, మిరప తదితర పంటలు నీటమునిగి జలాశయాలుగా మారాయి. వరద నీటి ఉద్ధృతికి కొల్లిమర్ల డ్రెయిన్ పలుచోట్ల కట్టలు తెగాయి. గరికపాడు, అప్పాపురం గ్రామాల మధ్య కొమ్మమూరు కాల్వకు రెండు భారీ గండ్లు, గార్లపాడు-కొండపాటూరు మధ్య నల్లమడ డ్రెయిన్‌కు ఒక గండి పడి వరదనీరు పొలంపైకి భారీగా చేరింది. ఓ వైపు వర్షం పడుతూ పొలాల్లో నీరు నిలుస్తుండగా, బయటకు వెళ్లేందుకు వీలుపడని రీతిలో డ్రెయిన్లు పొంగిపొరలుతుండటంతో పూర్తిగా జలాశయాలుగా మారాయి. తుఫాన్ ప్రభావం మరో రెండు రోజులు కొనసాగుతుందన్న సమాచారంతో రైతులు తమ పొలాలను రక్షించుకోలేమని ఆందోళన చెందుతున్నారు. నల్లమడ డ్రెయిన్, కొమ్మమూరు కాల్వకు గండ్లు పడటంతో సమాచారం అందుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, జెడ్పీ ఛైర్‌పర్సన్ షేక్ జానీమూన్, ఎంపిపి నక్కల శైలజలు అదికారులతో కలిసి అప్పాపురం, రేటూరు తదితర గ్రామాలకు చేరుకుని ముంపునకు గురైన పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, సాయం అందిస్తామని భరోసా కల్పించారు. త్వరితగతిన గండ్లు పూడ్చేందుకు, పొలాల్లోని నీటిని బయటకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలా ఉండగా శుక్రవారం రాత్రికి గరికపాడు, అప్పాపురం, కొండపాటూరు గ్రామ నివాసాల్లోకి చేరుతుందని భావిస్తున్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి రావెల ఆదేశించారు.