గుంటూరు

ప్రకాశం బ్యారేజ్ నుండి లక్ష క్యూసెక్కుల నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, సెప్టెంబర్ 23: కృష్ణా, గుంటూరు సరిహద్ధులోని ప్రకాశం బ్యారేజ్ నుండి లక్ష క్యూసెక్కుల నీరును అధికారులు దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద సందర్శకులు కృష్ణమ్మ జలకళను చూసేందుకు భారీగా తరలివచ్చారు. కొద్ది రోజుల క్రితం ముగిసిన కృష్ణాపుష్కరాలకు ప్రకాశం బ్యారేజ్ దిగువన అంతంత మాత్రంగా ఉన్న నీటిని చూసిన తమకు వరద పరవళ్ళతో కలకలలాడుతున్న కృష్ణానదిని చూస్తే ఎంతో ఆనందదాయకంగా ఉందంటున్నారు. ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లను ఎత్తి నీరు విడుదల చేయటంతో వరద నీరు అటు సీతానగరం పుష్కరఘాట్ వద్దకు ఇటు విజయవాడ ఘాట్‌ల వరకు సంపూర్ణంగా నది ప్రవహించటంతో నదికి ఇరువైపులా సందర్శకుల కోలాహలం ఎక్కువైంది. ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరగటంతో అవసరమైన మేరకు నీరు విడుదల చేయటం జరుగుతుందని అధికారులు చెపుతున్నారు.