గుంటూరు

డ్రైనేజీ అధికారుల వైఫల్యమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదనందిపాడు, సెప్టెంబర్ 23: డ్రైనేజీ అధికారుల వైఫల్యం కారణంగానే రైతాంగం ఇక్కట్లకు గురవుతున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆరోపించారు. నల్లమడ వాగు పరివాహక ప్రాంతాల్లో వరదముంపునకు గురైన ప్రాంతాలను మంత్రి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పెదనందిపాడు వంతెన వద్ద ఆయన మాట్లాడుతూ అతివృష్టి సమయాల్లో ముంపు తప్పడం లేదన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమార్గాన్ని కనుగొనాల్సిన అధికారులు తమ బాధ్యతను విస్మరించడంతో వాగు పరివాహక ప్రాంత రైతాంగానికి కడగండ్లు తప్పడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్లా రాజమోహనరావు, యార్లగడ్డ అంకమ్మచౌదరి ముంపు సమస్య తీవ్రతపై అనేకసార్లు వినతిపత్రాలు మంత్రులకు సమర్పించినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మంత్రి ఎదుట ఆందోళన వెలిబుచ్చారు. గత ప్రభుత్వ హయాంలో 200 కోట్ల రూపాయలతో నల్లమడ వాగు ఆధునికీకరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధంచేశారని తెలిపారు. దీన్ని పట్టించుకోవడం లేదని విన్నవించగా స్పందించిన మంత్రి రావెల ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. తదనంతరం పునరావాస కేంద్రాల్లోని బాధితులను పరామర్శించి, బియ్యం పంపిణీ చేశారు.