గుంటూరు

వరదల్లో జగన్ విమర్శలు బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 27: ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాజకీయాలను పక్కనబెట్టి ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో వరదపై జగన్ విమర్శలు చేయడం బాధాకరమని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాల్లో చెడులు జరుగుతున్నాయనే భావనతో జగన్ చూడటం సరికాదన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో అధికారులను నియమించి ఎప్పటికప్పుడు బాధితులకు అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకునేందుకు అధికారులకు అన్ని ఆదేశాలు ఇచ్చారన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. 5.76 లక్షల ఓట్లు ఉన్నాయని, 70 వార్డులుగా విభజించి ఒక్కో వార్డుకు 8 వేల ఓట్లు చొప్పున కేటాయిస్తున్నామన్నారు. కొత్తడోర్ నెంబర్ల వలన ఓటర్ల జాబితాలో పేర్లు వేరేచోటికి వెళ్లి ఉండవచ్చన్నారు. అంతేగానీ ఓట్ల తొలగింపు జరగలేదన్నారు. ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుంటామని, ఎన్నికల పొత్తులో వారికి ఇష్టం వచ్చిన చోట సీట్లు ఇచ్చి మాకు నష్టం కలిగే విధంగా ఉండకూడదన్నారు. వారికి కేటాయించిన సీట్లు కూడా తమ కార్యకర్తలు వారి అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. మేయర్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌ల మధ్య 20 టిఎంసిల నీరు నిల్వ చేసే మరో ప్రాజెక్టును నిర్మించుకుంటే భవిష్యత్తులో నీటి ఎద్దడిని అధిగమించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కంచర్ల శివరామయ్య, మానుకొండ శివప్రసాద్, పప్పుల దేవదాసు, మన్నవ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.