గుంటూరు

పర్యాటకంతో ఐక్యతాభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 27: అందరి కోసం పర్యాటకం.. అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని అన్ని దేశాలు జరుపుకుంటున్నాయని, పర్యాటకం ద్వారా ప్రపంచ ప్రజలందరిలో ఐక్యతాభావం పెంపొందుతుందని భారతీయ సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బందినేని రామకృష్ణ పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బౌద్ధశ్రీ పురావస్తు ప్రదర్శన శాల, భారతీయ సంస్కృతి ఆయర్వేద వికాస పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో పర్యాటక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సంస్కృతిని, వారసత్వాన్ని సంప్రదాయాలను ఎలా కాపాడుకోవాలో పర్యాటక ప్రాంతాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. పర్యాటక కేంద్రాలను దివ్యాంగులు, వృద్దులు, పిల్లలు అందరూ వీక్షించాలని తద్వారా మానసిక ఉల్లాసంతో చైతన్యవంతులై సమాజానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అనంతరం ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, పద్యరచన, టైలరింగ్ తదితర విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ సాయి భక్తకేశవ, అసిస్టెంట్ డైరెక్టర్ దీపక్‌జో, భారతీయ కళాసృజన్ ప్రాజెక్టు డైరెక్టర్ మందపాటి అనురాధ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులు, అధ్యాపకుల ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.