గుంటూరు

రాష్ట్రానికి హోదాకు మించిన ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం 2.25 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని, హోదాకు మించిన ఆదాయం రాష్ట్రానికి చేకూరిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జిల్లా పర్యటలో భాగంగా మంగళవారం తెనాలి పట్టణంలో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అధ్యక్షతన జరిగిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకారం అందించుకోవాలని, కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రాలు అభివృద్ధి చెందలేవని చెప్పారు. కొందరు రాష్ట్ర నాయకులు తాము కూర్కొన్న కొమ్మను తామే నరుక్కునట్లుగా కేంద్రంపై అనోసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1963లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆంధ్రా ఉద్యమాన్ని అణగదొక్కితే, ఆ తరువాత నాటి దేశప్రధాని ఇందిరాగాంధీ ఆంధ్రా, తెలంగాణ ఉద్యమాలను తొక్కివేశారన్నారు. 2004-14వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేయలేని ఎంతో అభివృద్ధిని కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు కేవలం రెండు సంవత్సరాలలోనే సాధించటంతో ఆపార్టీ నాయకులు అసూయతో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. దేశ, రాష్ట్ర ప్రజలు ఈవిషయాను గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్లుకోసం చివరి క్షణంలో 23 నిమిషాలలో రాష్ట్ర విభజన చేసిన తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. బిజెపి ప్రభుత్వం కేంద్రంలోకి వచ్చిన తరువాత రెండు తెలుగురాష్ట్రాలలోని దాదాపుగా అన్ని జలప్రాజెక్టులను గుర్తించి వాటిని పూర్తి చేసేందుకు తగిన సాయం చేస్తోందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టునిర్మాణం, కడప, ఖమ్మం ఉక్కు ప్యాక్టరీలు, ప్రత్యేక జోన్ వంటి అంశాలను చట్టంలో పొందుపరచక పోగా సాధ్యాసాధ్యాలను పరిశీలన చేయాలని మాత్రమే సూచించిందన్నారు. విభజన తరువాత ఏపిలో ఉన్నత విద్యాసంస్థలు, ప్యాక్టరీలు మంజూరు చేశామన్నారు. వాస్తవానికి కొండప్రాంతాలు, గిరిజనులు, అడవులు, వెనుకబడిన ప్రాంతాలతో పాటుగా ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఈహోదా వల్ల కేంద్రం 90శాతం, రాష్ట్రం 10శాతం నిధులతో అభివృద్ధి చేసుకోవాల్సిఉందన్నారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న రెవెన్యూ లోటు 5 సంవత్సరాలకు పరిష్కారం కాదని, 10 సంవత్సరాల అవసరముందన్నారు. 22 వేల కోట్ల రూపాయలతో 5 సంవత్సరాలలో ఈ లోటును భర్తీ చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర సహకారంతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అందుకు ప్రజలు తమ పూర్తిసహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, బిజేపి రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు, ఉపాధ్యక్షులు యడ్లపాటి రఘునాథబాబు, సెన్సార్‌బోర్డు సభ్యులు దిలీప్‌రాజా, మాజీ ఎంపి యడ్లపాటి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమ, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.