గుంటూరు

రాష్ట్రవ్యాప్తంగా సమస్యలపై ప్రజా ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 23: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్టవ్య్రాప్తంగా ప్రజా ఉద్యమాలను చేపట్టనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు సిపిఎం జిల్లా కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మధు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అభివృద్ధి పేరుతో లక్షలాది ఎకరాల భూములను సేకరించి, ఆయా ప్రాంతాల్లో రైతాంగానికి తగిన నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. ఆక్వా ఫుడ్ పార్కు పేరుతో భూములను సేకరించి వేలాది ఎకరాల్లో పంటనష్టం, పర్యావరణానికి హాని కల్గిస్తుందన్నారు. రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తుంటే ఉద్యమకారులపై తీవ్రంగా నిర్బంధాన్ని ప్రయోగిస్తుందన్నారు. సిపిఎం చేపడుతున్న ప్రజా ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములై ఉద్యమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఇ కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయన్నారు. బీమారంగంలో 49 శాతం పెట్టుబడులు ప్రైవేటుపరం చేస్తున్నారని, రక్షణ రంగంలో సైతం విదేశీ పెట్టుబడులు పెట్టడం ద్వారా రక్షణ రంగాన్ని సామ్రాజ్యవాదులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గత మూడేళ్లలో దేశంలో మతోన్మాద ధోరణులు పెరిగిపోయాయని, మైనార్టీలపై దాడులు కొనసాగుతున్నాయన్నారు. చివరకు ఏం తినాలో అనే విషయంపై కూడా కేంద్రం జోక్యం చేసుకుని హుకుం చలాయిస్తుందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేసి రెండున్నర సంవత్సరాలైనా ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించలేదన్నారు. పల్నాడు ప్రాంతంలో 12 వేల ఎకరాల భూములను సిమెంటు ఫ్యాక్టరీల నిర్మాణం కోసం కేటాయించి 10 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదన్నారు. ఆ ప్రాంతంలోని రైతులు, నిరుద్యోగులు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారన్నారు. నల్లమడ వాగు ముంపు వలన జిల్లాలో లక్ష ఎకరాల్లో పంట నష్టం జరుగుతుందని, 10 మండలాల్లో తీవ్ర ప్రభావం కన్పిస్తుందని, నేటికీ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లస్థలాలు, ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా సెక్రటేరియట్ సభ్యులు జొన్నా శివకుమార్, వై నేతాజీ, వై రాధాకృష్ణ, ఎన్ భావన్నారాయణ, ఎన్ చెంగయ్య, రవి, ఎవిఎన్ గోపాల్, కె హనుమంతరెడ్డి, మణిపాల్ తదితరులు పాల్గొన్నారు.