గుంటూరు

అభివృద్ధిని పట్టించుకోని పాలకులకు బుద్ధిచెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 25: ప్రజా సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోని పాలకులకు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో దిమ్మతిరిగే రీతిలో బుద్ధిచెప్పాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నగర మహిళా విభాగం అధ్యక్షురాలు గనిక ఝాన్సీరాణి ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలు కష్టాల ఊబిలో కూరుకుపోయారంటే అతిశయోక్తి కాదన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఏర్పడిన తర్వాత గుంటూరు నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఓట్లు దండుకున్న చంద్రబాబు రుణాలు మాఫీ చేయడం కాదుకదా డ్వాక్రా సంఘాలను ఎత్తివేసే ఆలోచన చేయడం దారుణమన్నారు. తెలుగుజాతి చరిత్రలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన పాలనే సువర్ణ అధ్యాయమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే మహ్మద్ ముస్త్ఫా మాట్లాడుతూ చంద్రబాబుకు ప్రజారంజక పాలనను అందించడంలో శ్రద్ధ లేకపోవడం విచారకరమన్నారు. పొరుగింటి పుల్లకూర సామెత చందంగా స్వదేశీ పరిజ్ఞానాన్ని పక్కనబెట్టి విదేశీ మోజులో ఉన్న పాలకులకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవాచేశారు. సమావేశంలో వైసిపి నాయకులు నిమ్మరాజు శారదాలక్ష్మి, వాసిరెడ్డి విజయమాధురి, సరోజసుధ, గంటా మరియమ్మ, వనజాక్షి, జ్యోతి, కప్పగంతుల శివపార్వతి, పి మరియమ్మ, పి రమాదేవి పాల్గొన్నారు.