గుంటూరు

అబద్ధపు హామీలతో రైతులను మోసగించిన సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల, మే 2: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా మోసగించిన ఘనుడు చంద్రబాబునాయుడని వైయస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరవు ధర్నాలో బాగంగా సోమవారం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర కరవు సంభవించిందన్నారు. కరవు సమయంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ఒక్కరూపాయి కూడ ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2013-14కు సంబంధించిన రూ.1642కోట్లు ఇవ్వాలని రైతులు కోరగా నష్టాల పేరుతో నేటివరకు ఇన్‌పుట్ సబ్సిడీలు రైతులకు ఇవ్వలేదన్నారు. కరవు సంభవిస్తుందని కేంద్ర ప్రభుత్వం ముందే తెలిపినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నారు. జనవరి, ఫిబ్రవరిలో రివ్యూలు చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అ దిశగా చర్యలు తీసుకోక పోవటమే కాకుండా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కరవు సందర్భంలో వలసలను నివారించేందుకు ఉపాధి పనులు కేటాయించాల్సి ఉండగా ఆ నిధులను సైతం నీరు - చెట్టు కార్యక్రమానికి, సిమెంటు రోడ్లకు కేటాయించటం ఎంతవరకు సబబన్నారు. తాము సిమెంటు రోడ్లు వ్యతిరేకం కాదని ఉపాధి హామీ పనులు పక్కదారి పట్టించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ 97.5 శాతం పనులు కూలీలకే కేటాయించారని నిబంధనల ప్రకారం 60 శాతం సైతం పనులు కూలీలకు కేటాయించకపోవటం దారుణమన్నారు. చెంతనే నాగార్జున సాగర్ ఉన్నా పల్నాడు ప్రాంత ప్రజలకు నీళ్ళు దొరకని పరిస్థితి నెలకొనటం బాధాకరమన్నారు. రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందని రైతులకు నీళ్ళు ఎలా ఇవ్వాలని ఆలోచించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలు సశ్యశ్యామలంగా ఉంటేనే రాయలసీమ జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, కంభం, నల్గొండ జిల్లాలు సశ్యశ్యామలంగా ఉంటాయన్నారు. మహబూబ్‌నగర్‌లో 115 టీఎంసీల నీటిని పాలమూరు నుంచి రంగారెడ్డికి డిండి ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ ద్వారా నీటిని తరలించుకుపోతుంటే చంద్రబాబు చూస్తూ మిన్నకుండి పోయాడన్నారు. దీనికి కారణం ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారన్నారు. వైయస్సార్ హయాంలో రూ.400కోట్ల వ్యయంతో వరికపూడిసెల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి రూ.100 కోట్లు కేటాయించారన్నారు. మహానేత మరణానంతరం ప్రాజెక్టునే రద్దు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. బ్యాంకుల్లోవున్న బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు కానీ... నేడు బాబు ముఖ్యమంత్రి అయ్యాక బంగారం వేళానికి వెళ్తున్నాయన్నారు. రుణమాఫీకి కేటాయించిన నగదు మూడు శాతం వడ్డీకే సరిపోవటంలేదన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కూడా వెన్నుపోట్లు, మోసం, దగాతో పరిపాలన కొనసాగిస్తున్నాడన్నారు. చంద్రబాబు లాంటి మనిషిని క్షమించకూడదు. రైతులు, పేదవారి గొంతు వినిపించకూడదని ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలను కొన్నట్లు రూ.20కోట్లు చెల్లించి కొనుగోలు చేస్తున్నాడని ఆరోపించారు. అందరం ఒకటై చంద్రబాబును బంగాళఖాతంలో కలుపుదామని పిలుపునిచ్చారు. అనంతరం తహశీల్దార్ ఫణీంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పినె్నల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముస్త్ఫా, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, వైయస్సార్‌సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పినె్నల్లి వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఖాళీ బిందెలతో మహిళలు జగన్‌తో కలసి ప్రదర్శనలో పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు స్పీకర్ కోడెల శ్రీకారం
సత్తెనపల్లి, మే 2: జననేత సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలంటూ పట్టణంలోని ఐదు లాంతర్ల సెంటర్ నుండి టిడిపి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలో 50 వేల ఇంకుడు గుంతల నిర్మాణాలకు సభాపతి కోడెల శంకుస్థాపన చేశారు. అనంతరం కారతీయ కళ్యాణ మండపంలో జరిగిన వర్షపునీటి ఇంకుడు గుంతల నిర్మాణాలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభాపతి ఇంకుడు గుంతల ఆవశ్యకతను వివరించారు. ముందుగా సభాపతి జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ నాయకులు ఏర్పాటు చేసిన బారీ బర్త్‌డే కేక్‌ను సభాపతి కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మి, కుమారుడు నియోజకవర్గ యువనాయకుడు డాక్టర్ కోడెల శివరామ్ కట్ చేశారు. కార్యక్రమాలలో కలెక్టర్ కాంతీలాల్‌దండే, ఎంపీపీలు నర్రా రమేష్, బొర్రా కోటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, మార్కెట్‌యార్డు చైర్మన్ ఆళ్ళ సాంబయ్య, పెద్దింటి వెంకటేశ్వర్లు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిద్రమత్తు వదిలి ప్రజల గోడు పట్టించుకోండి
* వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
సత్తెనపల్లి, మే 2: ఒక పక్క కరవు రక్కసి కోరల్లో రాష్ట్ర ప్రజలు విలవిల్లాడుతున్నా, మరోపక్క వర్షాభావం కారణంగా నిండుకుండల్లాంటి జలశయాలు అడుగంటిపోయి, ప్రజలు మంచినీటికోసం అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంలేదని, నిద్రమత్తు వదిలి ప్రజల గోడు పట్టించుకోవాలని రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వైయస్ ఆర్‌సీపి అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదురుగావున్న గుంటూరు మాచర్ల రహదారిపై అంబటి రాంబాబు అధ్వర్యంలో పట్టణ వైసీపి నాయకులు ధర్నా నిర్వహించారు. మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ వర్షాభావం కారణంగా పంటల సాగు తగ్గిపోయిందని, పెట్టుబడులు వచ్చే మార్గంలేక అన్నదాత ఆందోళన చెందుతున్నాడని, నియోజకవర్గంలోని పాలకులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. అనంతరం తాశీల్దార్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరాన్, మండల పార్టీ ఆధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, మండల పట్టణ యూత్ సెల్ అధ్యక్షుడు కళ్లం విజయభాస్కరరెడ్డి, అచ్యుత శివప్రసాద్, పార్టీ జిల్లా కార్యదర్శి గార్లపాటి ప్రభాకర్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వల్లెం నరసింహారావు, బీసిసెల్ నాయకులు తుమ్మల వెంకటేశ్వర్లు, గుంటూరు సుషీంద్రకుమార్, ఆకుల హనుమంతరావు, కూకుల్ల శ్రీనివాసరావు, మద్దు రత్నరాజు, చుక్కా మోషే, చిలకా రమణయ్య, బుడగాల సుబ్బారావు, సయ్యద్ కలి తదితరులు పాల్గొన్నారు.