గుంటూరు

రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), మే 2: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సెజ్‌ల పేరుతో వాన్‌పిక్, లేపాక్షి, సరస్వతి సిమెంటు ఫ్యాక్టరీల పేరుతో వేలాది ఎకరాలను రైతుల వద్ద నుంచి అప్పనంగా కాజేసి, చివరకు ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా రైతులపైనే దాడులు చేసిన జగన్‌కు అన్నదాతల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో సరస్వతి సిమెంటు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని 2005లో భూములు తీసుకుని 2014 వరకు ఎటువంటి పరిశ్రమలు స్థాపించక పోవడంతో రైతులు ఆ భూములను సాగు చేసుకుంటున్న తరుణంలో వారిపై దాడులకు పాల్పడ్డారన్నారు. రాయలసీమ, పులివెందుల తరహాలో పల్నాడు ప్రాంతంలో కూడా రౌడీలతో దళిత మహిళలను సైతం బాంబులతో, కత్తులతో బెదిరించి అరాచకానికి పాల్పడ్డారన్నారు. మాచర్ల ధర్నా సందర్భంగా ప్రభుత్వంపై జగన్ అసందర్భ పిచ్చిప్రేలాపనలు పేలుతున్నారని, ఆ వైఖరి మార్చుకోకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతు, డ్వాక్రా, హార్టికల్చర్ రుణమాఫీ చేస్తూనే లోటుబడ్జెట్‌లో కూడా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కళ్లుండీ కబోది లాగా జగన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని జగన్ పద్ధతి నచ్చకే ఆ పార్టీని వీడుతున్నారని, చివరకు ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని జోస్యంచెప్పారు. వైఎస్ హయాంలో లక్ష కోట్ల అవినీతి జల ప్రాజెక్టుల్లో జరిగిందని, ఒక్క సంవత్సరంలోనే పట్టిసీమను పూర్తిచేసి కృష్ణా, గోదావరి నదులను తెలుగుదేశం అనుసంధానం చేసిందన్నారు. తునిసభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక శక్తులను ప్రోత్సహించి దాడులకు పాల్పడిందని, త్వరలో నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని, జగన్ ఒక ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, గుంటుపల్లి మధుసూదనరావు, యాగంటి దుర్గారావు, హర్షవర్ధన్, చిట్టాబత్తిన చిట్టిబాబు, చంద్రగిరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.