గుంటూరు

అవినీతికి తావులేకుండా పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 18: దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పారిశ్రామికవేత్తలకే లబ్ధిచేకూరుతుందని, అవినీతికి తావులేకుండా దేశవ్యాప్తంగా సిపిఐ పోరాటాలు నిర్వహిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు ఎపి రాష్ట్ర సమితి పార్టీ హోల్‌టైమర్ల రాష్టస్థ్రాయి శిక్షణ తరగతులు నగరంపాలెంలోని కెకెఆర్ ఫంక్షన్ హాలులో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ నిరంకుశ ధోరణితో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని, నాయకులకు ఆత్మగౌరవం ఉంటే పదవుల నుంచి తప్పుకుని హోదా కోసం పోరాటం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా బిజెపి హవా రోజురోజుకూ తగ్గుతూ వస్తుందన్నారు. ఢిల్లీ, బీహార్, అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమన్నారు. యుపి ఎన్నికల్లో గెలుపుకోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ వారికి అనుకూలంగా ప్రజలు లేరన్నారు. వామపక్ష పార్టీలు చేస్తున్న పోరాటాలకు సెక్యులర్‌లు సహకరించాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ సిపిఐ ప్రజా సమస్యలతో పాటు సామాజిక అంశాలైన ప్రత్యేకమోదా, విశాఖ రైల్వేజోన్, పోలవరం తదితర అంశాలపై పోరాటం చేస్తూనే ఉందన్నారు. వెంకయ్య నాయుడు పదే పదే తప్పులు చేస్తున్నారని, గతంలో హోదా సాధించామని సన్మానం చేయించుకుని, ప్రస్తుతం ప్యాకేజీ సాధించామని మరో మారు సన్మానాలు చేయించుకుంటున్నారని ఎద్దేవాచేశారు. ఈ సన్మానాలకు చంద్రబాబు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. ప్యాకేజీ వలన 2.25 లక్షల నిధులు వస్తాయని వెంకయ్య నాయుడు చెప్తుండగా 70 వేల ఓట్లు వస్తాయని చంద్రబాబు చెప్తున్నారని, ఏది వాస్తవమో స్పష్టంచేయాలన్నారు. వీరందరినీ పెట్టి ఇద్దరు మోసగాళ్లు సినిమా తీస్తే బాగుంటుందని, నరేంద్రమోదీ ముందు మాట్లాడే దమ్ములేనివారు తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే దొంగ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ జాతీయ కంట్రల్ కమిషన్ చైర్మన్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య విప్లవాన్ని తీసుకురావాల్సిన బాధ్యత వామపక్ష పార్టీలపై ఉందన్నారు. ప్రస్తుతం సమస్యలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విప్లవాన్ని సామాజిక, సాంస్కృతికంగా ఆయా రంగాల్లో చైతన్యం తీసుకురావడానికి పార్టీ కృషిచేయాలన్నారు. ప్రస్తుత శిక్షణా తరగతులు బలమైన పార్టీ ఏర్పాటుకు ఎంతో ఉపకరిస్తాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి సత్యనారాయణమూర్తి, కార్యవర్గ సభ్యులు హరనాథరెడ్డి, జె విల్సన్, ఓబులేసు, జిల్లా, నగర కార్యదర్శులు జంగాల అజయ్‌కుమార్, కోట మాల్యాద్రి, సమితి సభ్యులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, గని, పులి సాంబశివరావు, చంద్రా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
* ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్
పెదకూరపాడు, సెప్టెంబర్ 18: మండలంలోని మారుమూల గ్రామా ల్లో సైతం పల్లెలు అభివృద్ధి చెందడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పెదకూరపాడు శాసనసభ్యుడు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీ్ధర్ పేర్కొన్నారు. మండలంలోని పెదకూరపాడు గ్రామంలో జీవో నెంబర్ 389 గ్రాంట్ ద్వారా కోటి 95 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సిమెంటు రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అర్తిమళ్ల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో 10వ వార్డులో పాలకేంద్రం వద్ద ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సిసి రోడ్లకు ఎమ్మెల్యే శ్రీ్ధర్ భూమి పూజ చేశారు. అనంతరం ఆనందపేటలోని ఎంపిపి స్కూలు వద్ద సిసి రోడ్డు నిర్మాణ పనులకు మండల టిడిపి ప్రముఖులతో కలిసి శంకుస్థాపన గావించారు. తొలుతగా పెదకూరపాడు పొలాల్లో ఎన్‌టిఆర్ జలసిరి ఫేజ్-2 ద్వారా లక్షా 18 వేల కిమ్మత్తుతో ఏర్పాటుచేసిన బోరుబావికి ఎమ్మెల్యే శ్రీ్ధర్ ప్రారంభోత్సవం చేశారు. ఎండిఒ కావూరి గీతారాణి ఆధ్వర్యంలో బోరుబావులు మండలంలో సుమారు 82 వరకు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రామగోపాలరావు, గల్లా బాబురావు, యార్డు డైరెక్టర్ ఏటుకూరి బ్రహ్మయ్య, సొసైటీ డైరెక్టర్ భాష్యం ఆంజనేయులు, చెరుకూరి పుల్లయ్య, ఏటుకూరి వెంకటరత్నం, వడ్లమూడి అప్పారావు, పాటిబండ్ల మాబు, డీలర్ సయ్యద్ సుభాని, కాల్వ అప్పారావు, ఎంపిపి శివమ్మ, 75 తాళ్లూరు సాయి, ఆంజనేయరెడ్డి, వెంకటరెడ్డి, జెడ్పీటీసీ షరీఫ్, షేక్ లాలు, ఖలీల్, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ముస్లిం మైనార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశాన్ని షాదీఖానాలో ఏర్పాటుచేయగా ఎమ్మెల్యే శ్రీ్ధర్ పాల్గొని కార్యకర్తలతో ముచ్చటించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్త నందిగం రమేష్ మాతృమూర్తి చనిపోయినందున అతని గృహానికి వెళ్లి ఎమ్మెల్యే శ్రీ్ధర్ రమేష్‌ను పరామర్శించారు.

ప్రమాదకరంగా డ్రైనేజీలు
మంగళగిరి, సెప్టెంబర్ 18: పట్టణంలో ఎల్లవేళలా ట్రాఫిక్ రద్దీతో ఉండే గౌతమబుద్ధ రోడ్డుకు తూర్పువైపున గల డ్రైనేజీ పాలకుల నిర్లక్ష్యాన్ని చాటిచెప్తోంది, వ్యాపార సంస్థల ఎదుట 8 నుంచి 10 అడుగుల వెడల్పున ఉన్న డ్రైనేజీ ప్రమాదకరంగా దర్శన మిస్తుండటంతో పౌరులు , వ్యాపారస్థులు పడరాని పాట్లు పడుతున్నారు. వ్యాపార సంస్థల ఎదుట నడకకోసం సొంతఖర్చులతో వెదురుకడ్డీలు, చెక్క, ఇనుప రేకులతో దారిని ఏర్పాటు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహం సెంటర్‌నుంచి కిలోమీటరు పొడవునా డ్రైనేజీ మురుగుతో నిండి నీటిపారుదలలేక అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రజ లు అల్లాడుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణంలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద 30 కోట్ల రూపాయలు వెచ్చించి డ్రైనేజీలను నిర్మించారు. డ్రైనేజీల నిర్మాణాల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకోవడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండున్నరేళ్ల కిందట టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ మంగళగిరి అభివృద్ధికి కేటాయించిన నిధులు తక్కువేనని చెప్పవచ్చు. మున్సిపల్ పాలకవర్గం అధికార పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ నిధుల సాధనలో విఫల మయిందన్న విమర్శలు ఉన్నాయి. కొండ ప్రాంతంనుంచి వచ్చే మురుగునీరు, వర్షపునీరు ప్రవహించే ప్రధానమైన డ్రైనేజీ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించు కోవడంలేదని ప్రజానీకం వాపోతోంది. ఈ ప్రాంతం రాజధానిగా మారినప్పటికీ అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. గౌతమబుద్ధ రోడ్డులో నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. పక్కనే ఉన్న డ్రైనేజీ గురించి మాత్రం పట్టించుకున్నవారే లేరు. అధికార, ప్రతిపక్షాల సభ్యులు ఆదాయంపైనే తప్ప అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని వినవస్తోంది. ఒకప్పుడు సమస్యలపై పోరాడే కమ్యూనిస్టులు సైతం ఏ కారణం చేతనో వెనుకడుగు వేస్తున్నారు. వర్షాలు వచ్చినప్పుడు గౌతమబుద్ధ రోడ్డులోని డ్రెయిన్ నిండుగా ఉద్ధృత ప్రవాహంతో ఉంటుంది. ఆ సమయంలో చిన్నపిల్లలు, ఏదైనా వస్తువులు ప్రమాద వశాత్తు డ్రైనేజీలో పడితే కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులకు అనేకమార్లు చెప్పినా స్పందించడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. స్వచ్ఛ మంగళగిరి చేస్తామని ఉపన్యాసాలు తప్ప పట్టణంలో ప్రధానమైన డ్రైనేజీ మురుగు కంపు కొడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని , మురుగు వలన దోమలు పెరిగి రోగాల బారిన పడతామనే ఆందోళనను పలువురు వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో స్పందించి గౌతమబుద్ధ రోడ్డులో డ్రైనేజీని సక్రమంగా నిర్మించి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రజానీకం కోరుతోంది.

ప్రజా సమస్యలపై
పోరాటం చేసేవారికే అవకాశం
గుంటూరు, సెప్టెంబర్ 18: ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ నిత్యం ప్రజలతో మమేకమయ్యే వారికి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అవకాశాలు ఉంటాయని వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో అప్పిరెడ్డి అధ్యక్షతన నగర ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో బాబు సర్కార్ పాలనలో ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నామని అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ వ్యక్తులను చిత్తుచేసి కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తమతో పాటు కలిసి వచ్చే పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుని ఎన్నికలకు వెళ్తామన్నారు. పార్టీని నమ్ముకుని జెండాను భుజాన పెట్టుకుని మోస్తూ క్రమశిక్షణతో పనిచేసే వ్యక్తులు నాయకులుగా ఎదుగుతారని అన్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించేందుకు నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కిలారి రోశయ్య మాట్లాడుతూ అధికారంలో ఉన్నామని, తాయిలాలతో అధికారంలోకి రావచ్చని భావించే నేతలకు ప్రజలు తిరుగులేని తీర్పునివ్వనున్నారని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు మామిడి రాము, పోలూరు వెంకటరెడ్డి, అత్తోట జోసఫ్, డైమండ్‌బాబు, అంగడి శ్రీనివాసరావు, రాజా, నాగం కాశీవిశ్వనాథం, ఎస్‌కె జాని, కె కవిత, ఆరుబండ్ల కొండారెడ్డి, ప్రేమ్‌కుమార్, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
అమరావతి, సెప్టెంబర్ 18: మదర్‌థెరిస్సా సోషల్ సర్వీస్ సొసైటీవారి సౌజన్యంతో ఎ-1 ఆర్థోకేర్ గుంటూరువారు ఆదివారం స్థానిక యోగాశ్రమంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్య శిబిరాన్ని అమరావతి సిఐ మురళీకృష్ణ ప్రారంభించారు. ప్రారంభ సభకు సోషల్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి ఉప్పుటూరి మోహనరావు అధ్యక్షత వహించారు. సిఐ మురళీకృష్ణ మాట్లాడుతూ మోకాళ్లు, ఎముకలకు సంబంధించిన జబ్బుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వయస్సుతో నిమిత్తం లేకుండా ఈ తరహా జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని గుర్తుచేశారు. డాక్టర్ కంచర్ల రాంప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్వచ్ఛంద సేవాసంస్థల సహకారంతో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మోకాళ్ల మార్పిడి, మోకాళ్ల అరుగుదల వంటి ఆపరేషన్లను అదునాతనమైన పద్ధతుల్లో నిర్వహిస్తున్నట్లు వివరించారు. సొసైటీ అధ్యక్షుడు కొమ్మినేని శివకోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాసేవే తమ సొసైటీ లక్ష్యమని, హరిశ్చంధ్రపురంలో తమ సొసైటీ ద్వారా పేద బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఉచిత విద్య అందించేందుకు ఒక స్కూల్‌ను కూడా స్థాపించినట్లు తెలిపారు.
300 మందికి వైద్య పరీక్షలు...
ఉచిత వైద్య శిబిరంలో మోకాళ్ల మార్పిడి సర్జన్ డాక్టర్ కంచర్ల రాం ప్రసాద్ 300 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా సలహాలు, సూచనలతో పాటు మందులు అందించారు. ఎముకల సాంధ్రత పరీక్షతో పాటు ఉచితంగా ఎక్సరేలు కూడా తీసి రోగులకు సహకరించారు. 300 మందికి పరీక్షలు నిర్వహించగా 120 మంది వివిధ రకాల శస్తచ్రికిత్సలకు అర్హత పొందారని తెలిపారు. వీరందరికీ ప్రభుత్వ సాయంతో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని సొసైటీ కార్యదర్శి మోహనరావు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో పల్లోటి జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయుడు బలుసుపాటి సత్యనారాయణ, సొసైటీ సభ్యులు రోగులకు సేవలందించారు.

నెలాఖరులోగా
మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి
అచ్చంపేట, సెప్టెంబర్ 18: మండలంలో గుర్తించిన బహిరంగ మలవిసర్జనలేని గ్రామాల్లో ఈ నెలాఖరుకల్లా మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని ఎండిఒ డిజి నాయక్ లబ్ధిదారులతో చెప్పారు. ఆదివారం గుర్తించిన గ్రామాలైన కోగంటివారిపాలెం, చింతపల్లి, చెరుకుంపాలెం, రుద్రవరం, అంబడిపుడిల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 914 మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంకాగా వాటిలో 597 మరుగుదొడ్లను పూర్తి చేయించామన్నారు. మరో 240 మరుగుదొడ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 27 మరుగుదొడ్ల నిర్మాణ పనులను కొత్తగా చేపట్టబోతున్నామని చెప్తూ 50 అదనంగా నమోదైన మరుగుదొడ్లను జాబితా నుంచి తొలగించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు, ఎన్‌ఆర్‌ఇజిఎస్ సిబ్బంది ఉన్నారు.

సేద్యానికి ఉచిత విద్యుత్ అదనంగా 2 గంటలు ఇవ్వాలి
మంగళగిరి, సెప్టెంబర్ 18: సేద్యానికి ఇప్పుడిస్తున్న ఉచిత విద్యుత్‌ను అదనంగా మరో రెండు గంటలు కూడా పొడిగించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ నియోజకవర్గ టిడిపి సమన్వయ కమిటీ సమావేశం తీర్మానించింది. ఆదివారం స్థానిక టిడిపి కార్యాలయంలో కమిటీ సమావేశం పార్టీ ఇన్‌చార్జ్, మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అధ్యక్షతన జరిగింది. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని, రోగులకు అత్యవసర సేవలు అందించేందుకు సిబ్బందిని నియమించి అవసరమైన పరికరాలను సమకూర్చాలని, పేదలకు అందించే ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి మంజూరైన ఇళ్లకు తోడు అదనంగా ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించింది. మంగళగిరి, దుగ్గిరాల యార్డుచైర్మన్లు ఆరుద్ర భూలక్ష్మి, వంగా సాంబిరెడ్డి, నందం అబద్దయ్య, చావలి ఉల్లయ్య, గుత్తికొండ ధనుంజయరావు, గాదె పిచ్చిరెడ్డి, వల్లభనేని సాయిప్రసాద్, వెలగపాటి విలియం, కోసూరి రాజశేఖర్, కుక్కమళ్ల స్వామి, బెజ్జం రామకృష్ణ, వై కోటేశ్వరరావు, ఖాసింఖాన్ తదితరులు పాల్గొన్నారు.

గుర్రపు డెక్కతో వరిపొలాలకు ముంపు
భట్టిప్రోలు, సెప్టెంబర్ 18: మురుగు కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకుకారణంగా మండల కేంద్రం భట్టిప్రోలులోని పలు పల్లపు ప్రాంతాలలో వర్షపునీరు నిలిచిపోవటంతో సుమారు 200 ఎకరాల వరిపొలాలకు ముంపు ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసి ఐదు రోజులు గడుస్తున్నా గుర్రపు డెక్క ఆకుతో నీటి పారుదల నిలిచిపోయి వరిపొలాలు నేటికీ బయటపడలేదు. భట్టిప్రోలు నుండి చావలి వళ్ళే రహదారి మార్గంలో అద్దేపల్లి సమీపంలోని బాడవ పొలాలు ఇటీవల కురిసిన వర్షాలకు నీటమునిగాయి. ఈనీరు బయటకు వెళ్ళేందుకు ఏకైక మార్గం కనగాల మురుగు కాలువ మాత్రమే. మునిగిన పొలాలు బయట పడక పోవటంతో వరిదుబ్బులు కుళ్ళి పనికిరాకుండా పోతాయిన రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి సంఘాల ఆధ్వర్యంలో ఈసంవత్సరం పలు కాలువలు అభివృద్ధి పరిచినప్పటికీ కనగాల డ్రెయిన్‌లో ఎటువంటి పనులు చెపట్టక పోవటంతో ఈసంవత్సరం కూడా తీరని నష్కాన్ని చవిచూడాల్సి