గుంటూరు

రేపు జిల్లా విస్తృత స్థాయి టిడిపి సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), అక్టోబర్ 22: జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అరండల్‌పేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరగనుంది. జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, పార్లమెంటు, శాసనసభ, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారన్నారు. పార్టీ సభ్యత్వం కార్డు, పసుపుచొక్కా ధరించి సమావేశానికి హాజరు కావాలని జిల్లా పార్టీ నాయకులు కోరారు.

అశ్రునయనాలతో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీదేవి అంత్యక్రియలు

మాచర్ల, అక్టోబర్ 22: మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న తొలి మహిళా మున్సిపల్ చెర్‌పర్సన్ గోపవరపు శ్రీదేవి అంత్య క్రియలు శనివారం పట్టణంలో పార్టీ నాయకుల అశ్రనయనాల మధ్య నిర్వహించారు.
శ్రీదేవి భౌతిక కాయాన్ని ఆమె నివాసం నుండి పార్టీ నాయకులు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఉంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించుకుంటూ హిందూ స్మశాన వాటికకు తీసుకొని వెళ్లారు. కడసారి శ్రీదేవికి నివాళులు అర్పించిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబు, స్థానిక టీడీపీ నాయకులు యెనుముల మురళీధరరెడ్డి, నిమ్మగడ్డ వాసు, వీరమాచినేని సుభాష్‌చంద్రబోస్, చిరుమామిళ్ళ కృష్ణయ్య, ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు, వైయస్సార్‌సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పినె్నల్లి వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బోయ రఘురామిరెడ్డి, కౌన్సిలర్లు అనె్నం అనంతరావమ్మ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో దోమలపై దండయాత్ర ర్వాలీ
మంగళగిరి, అక్టోబర్ 22: మండల పరిధిలోని చినకాకాని, కాజ, ఆత్మకూరు మొదలైన గ్రామాల్లో శనివారం స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా దోమలపై దండయాత్ర ర్యాలీ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జిల్లా పంచాయితీ అధికారి కె శ్రీదేవి , ఎంపిడిఓ పద్మావతి, తహశీల్దార్ విజయలక్ష్మి, ఇఓఆర్‌డి రవికుమార్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు కుక్కమళ్ల నాగేశ్వరరావు, కట్టెపోగు వెంకయ్య, వింజమూరి జ్యోత్స్న, ఎంపిటిసి సభ్యులు కుక్కమళ్ల శ్రీనివాసరావు, నరసింహారావు, హెల్త్ అసిస్టెంట్ జయరాజు, పంచాయితీ కార్యదర్శులు శ్రీరామమూర్తి, రమేష్, సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.