గుంటూరు

తల్లి ఆరోగ్య రక్షణలో ప్రధాన భూమిక పోషించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: జిల్లాలోని ప్రతి తల్లి ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించేందుకు ఎఎన్‌ఎంలు ప్రధాన భూమిక పోషించాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కోరారు. బుధవారం ఎన్‌జిఓ హోంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యాధికారులు, ఎఎన్‌ఎంలకు ఎఎన్‌ఎం ఆన్‌లైన్ అప్లికేషన్స్‌పై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్, రీజినల్ డైరక్టర్ షాలీనిదేవి, డిఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మజారాణి జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ ప్రతి తల్లి చిరునవ్వుతో ఆరోగ్యకరమైన జీవనం సాగించేందుకు క్షేత్ర స్థాయిలో ఎఎన్‌ఎంల పాత్ర ప్రధానమైందన్నారు. ఎఎన్‌ఎంలు తమ పరిధిలోని గ్రామాల్లో ఉన్న జనాభా సంఖ్య, వారిలో గర్భిణీ స్ర్తిలు, పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లల ఆరోగ్య స్థితిగతుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయటానికి ప్రభు త్వం ఎఎన్‌ఎంలకు ట్యాబ్‌లను అందజేయటం జరిగిందన్నారు. సంబంధిత వివరాలను ఏలా నమోదు చేయాలన్న విధానంపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ప్రతి వైద్యాధికారి, ఎఎన్‌ఎంలు సంబంధిత సమాచారాన్ని సక్రమంగా ట్యాబ్‌లో పొందుపర్చిన పక్షంలో సకాలంలో వైద్య సేవలు అందించే అవకాశం ఉందన్నారు. అందువల్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. వంద శాతం సమాచారాన్ని ట్యాబ్‌లో క్రోడికరించేందుకు ప్రతి ఎఎన్‌ఎం కృషి చేయాలన్నారు. ప్రతి తల్లి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మ నివ్వాలని కోరుకుంటుందని, అవగాహన రాహిత్యం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన అంగవైకల్యంలో శిశువులకు జన్మనివ్వటం జరుగుతుందన్నారు. దేశంలో 68 శాతం మాత్రమే అక్షరాస్యత ఉండగా, అందులో మహిళ అక్షరాస్యత శాతం తక్కువగా ఉందన్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది మహిళల్లో అక్షరాస్యత పెంచటంతోపాటు, ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన బాధ్యత ఎఎన్‌ఎంలు, వైద్యులు స్వీకరించాలని కలెక్టర్ కాంతిలాల్ దండే కోరారు.

పెదవడ్లపూడిలో రాష్ట్ర స్థాయి ఓపెన్ సైక్లింగ్ రేస్
మంగళగిరి, ఫిబ్రవరి 3: మండల పరిధిలోని పెదవడ్లపూడిలో భగవాన్ శ్రీ సత్య షిరిడీ సాయిబాబా మందిరం 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ రామినేని ఫౌండేషన్ సౌజన్యంతో బుధవారం ఎపి రాష్టస్థ్రాయి ఓపెన్ సైక్లింగ్ రేస్ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు పోటీలను ప్రారంభించారు. మొత్తం 42 మంది పోటీల్లో పాల్గొన్నారు.
డి దశరథరామిరెడ్డి (ప్రథమ), టి సాంబశివారెడ్డి (ద్వితీయ), డి గోపాలరెడ్డి (తృతీయ) స్థానాలు గెల్చుకున్నారు. ఎస్‌కె సలీం, వి విష్ణునారాయణరెడ్డి, కె కిరణ్ వరుసగా 4,4,5 స్థానాల్లో నిలిచారు. బెస్ట్ సైక్లిస్టు అవార్డు భానుప్రసాద్ గెల్చుకున్నారు. పోటీలను వి వినాయకప్రసాద్ పర్యవేక్షించారు. పోటీల అనంతరం విజేతలకు గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు బహుమతులను అందజేశారు. రామినేని ఫౌండేషన్ చై ర్మన్ ధర్మప్రచారక్, జెడ్పీమాజీచైర్మన్ పాతూరి నాగభూషణం, జవ్వాది అమ్మయ్యచౌదరి, సైక్లింగ్ కోచ్ లింగినేని అర్జునరావు, లింగినేని శ్రీనివాసరావు, సీనియర్ సైక్లిస్టులు సింహాద్రి, కనకారావు తదితరులు పాల్గొన్నారు.