గుంటూరు

టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), మార్చి 26: తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈనెల 29వ తేదీన ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. 1982 మార్చి 29న స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించిందన్నారు. నాడు ఎన్‌టిఆర్ తెలుగుప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిస్తే, నేడు చంద్రబాబు తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు నిలువుటద్దంగా మారారని కొనియాడారు. కుహనా రాజకీయ మేధావుల గుండెల్లో దడ పుట్టించిన తెలుగుదేశం జాతీయ పార్టీలకు సైతం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా తమ పార్టీకి ఢోకా లేదన్నారాయన. అసమర్థుడు, అవినీతిపరుడైన జగన్ నిర్ధిష్టమైన సిద్ధాంతాలు లేకుండా బహిరంగ సభలకు హాజరయ్యే జనాన్ని చూసి బలం అనుకుంటే భంగపాటు తప్పదన్నారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ లాల్‌వజీర్ మాట్లాడుతూ ఆవిర్భావం రోజున గ్రామ, వార్డు, ఏరియాలలో జెండా దిమ్మెలకు పసుపు రంగులు వేసి జెండావిష్కరణ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని కోరారు. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ప్రజలకు ఆకట్టుకునే విధంగా సైకిల్, మోటారుసైకిల్ ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నూతన రాజకీయాన్ని తెలుగుజాతికి రుచి చూపించి వారి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని కొనియాడారు. విలేఖర్ల సమావేశంలో జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి కంచర్ల శివరామయ్య, నాయకులు వట్టికూటి హర్షవర్ధన్, దారపనేని నరేంద్ర, మన్నవ కోటేశ్వరరావు, బత్తుల శ్రీనివాసరావు, అజయ్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.
తాగుడు మానుకోమన్నందుకు
తప్పతాగి తండ్రిని కొట్టి చంపిన తనయుడు
సత్తెనపల్లి, మార్చి 26: తాగిన మైకంలో ఓ యువకుడు కన్న తండ్రిని కడతేర్చిన సంఘటన సత్తెనపల్లి మండల పరిధిలోని భీమవరంలో శనివారం జరిగింది. రూరల్ ఎస్‌ఐ కె వెంకట్రావ్ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మద్యం మత్తుకు బానిసగా మారిన పెద్దకుమారుడు చల్లా హరీష్‌కు మద్యం తాగొద్దని, తాగి తన ఇంటికి రావద్దని తండ్రి అంకాలు (45) హితవు పలికాడు. దీనితో తండ్రి కొడుకుల మద్య వాగ్యివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒళ్లు మరిచిపోయిన హరీష్ ఉద్రేకంలో ఇంటి వద్ద మంచం మీద పడుకొని వున్న తండ్రిని పక్కనున్న రోకలి బండతో తల పగలగొట్టాడు. తీవ్ర రక్తస్రావమై అంకాలు అక్కడికక్కడే మృతి చెందాడు. అంకాలు భార్య చల్లా ఏసుకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, తండ్రిని కొట్టి చంపిన కొడుకు హరీష్ పరారీలో ఉన్నాడని ఎస్‌ఐ వెంకట్రావ్ తెలిపారు.