గుంటూరు

నకిలీ డాక్యుమెంట్ల కేసులో నలుగురి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మార్చి 29: మండలంలోని చినకాకాని గ్రామ పరిధిలో ఎన్నారై ఆస్పత్రి ఎదుట కోట్ల రూపాయల విలువైన 2.84 ఎకరాల భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించబోయిన కేసులో నిందితులైన పాల్వాయి గురవయ్య, గడ్డం ప్రసన్నలక్ష్మి, మెలిశెట్టి వెంకటరత్నం, కైతేపల్లి మహేష్ అనే నలుగురిని అరెస్ట్ చేసినట్లు నార్త్‌జోన్ డిఎస్పీ గోగినేని రామాంజనేయులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం పట్టణ పోలీసు స్టేషనులో సిఐ బొప్పన బ్రహ్మయ్య, ఎస్సై జిలానీలతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నిందితులను మీడియాకు చూపి కేసు వివరాలను వెల్లడించారు. డిఎస్పీ కథనం ప్రకారం అచ్చంపేటకు చెందిన పాల్వాయి గురవయ్య గుంటూరు నగరంలోని పండరీపురం నాలుగోలైనుకు చెందిన గడ్డం ప్రసన్నలక్ష్మి, విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద గల గాజులపేటకు చెందిన మెలిశెట్టి వెంకటరత్నం, విజయవాడనగరంలోని బాంబే కాలనీలో ఉంటున్న డాక్యుమెంట్ రైటర్ కైతేపల్లి మహేష్, మరో 8 మంది.. మొత్తం 12 మంది కలిసి చినకాకానిలోని సర్వే నెంబర్ 236/1 ఎ1, 236/1 బి1లో గల 2.86 సెంట్ల భూమికి నకిలీ డాక్యుమెంట్ తయారు చేసి విక్రయించే ప్రయత్నంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు అనుమానం వచ్చి నిలిపివేశారు. అప్పటికే లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి ఫీజుగా కూడా చెల్లించారు. భూమికి సంబంధించిన అసలు యజమాని పాతమంగళగిరికి చెందిన వాకా రామగోపాల్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూమిని విక్రయించేందుకు ప్రయత్నించారని తేలింది. దీంతో ఇద్దరు మహిళలతో సహా నలుగురిని అరెస్ట్ చేశామని, మరో 8 మందిని ఈ కేసులో అరెస్ట్ చేయాల్సి ఉందని, పరారీలో ఉన్నవారికోసం గాలిస్తున్నామని డిఎస్పీ రామాంజనేయులు తెలిపారు. మంగళగిరి ప్రాంతంలో విలువైన భూములకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే వ్యక్తులు ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

లారీ ఢీకొని వ్యక్తి మృతి

మేడికొండూరు, మార్చి 29: గుంటూరు-సత్తెనపల్లి ప్రధాన రహదారిలోని పేరేచర్ల డొంకలో లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి... గుంటూరు రూరల్ మండలం, వెంగళాయపాలెంకు చెందిన పల్లపు పోలయ్య నడుచుకుంటూ పేరేచర్లకు వస్తుండగా గుంటూరు-సత్తెనపల్లి ప్రధాన రహదారిపై గల పేరేచర్ల డొంకలో క్రషర్‌కు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో పల్లపు పోలయ్య (60) అ క్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, ఎస్‌ఐ జ్యోతుల అనురాధ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.