గుంటూరు

‘మెగా ఇంజనీర్స్’ ప్రతినిధులపై కమిషనర్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 29: ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన పైపులైన్ల అనుసంధానపు పనులు మెగా ఇంజనీర్స్ సంస్థ ప్రతినిధులు సక్రమంగా పూర్తి చేయకపోవటాన్ని గుర్తించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని హెచ్‌ఎల్‌ఆర్ రిజర్వాయర్ ప్రాంతంలో కమిషనర్ నాగలక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో పైపులైన్ల నిర్మాణం చేపట్టిన మెగా ఇంజనీర్స్, ఎన్‌సిసి కం పెనీల ప్రతినిధుల ద్వారా పనుల వివరాలను తెలుసుకున్నారు. పైపులైన్లు వేసిన ప్రాంతాల్లో ఇంటర్ కనెక్షన్లు ఇవ్వకపోవటం, పైపులైన్లు వేయటానికి త వ్విన రహదారులను యథాతథ స్థితికి తీసుకురాక పోవటంపై ఆగ్రహం వ్య క్తం చేశారు. సదరు పనులకు సంబంధించి నగర ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, వెంటనే వాటిని సరి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అధికారులకు సహకరించి వెంటనే పనులు పూర్తి చేయాలని మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులను ఆదేశించారు. నగరంలోని బాలాజీనగర్, ఐపిడి కాలనీ, హుడారోడ్డు, పొన్నూరు రోడ్డు, లాంఛస్టర్ రోడ్డు, సుద్దపల్లి డొంక తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. అనంతరం పండరీపురం, బ్రాడీపేటలో ఆక్యుపెన్సీ సర్ట్ఫికేట్ల అనుమతి కోసం దాఖలు చేసిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్న భవనాలకు అనుమతులు మంజూరు చేశారు. ఈ పర్యటనలో మెగా ఇంజనీరింగ్ సంస్థ, ఎన్‌సిసి కంపెనీల ప్రతినిధులు, ప్రజారోగ్య శాఖాధికారులు, పట్టణ ప్రణాళిక శాఖాధికారులు, నగర పాలక సంస్థ ఎస్‌ఇ గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా నగరపాలక సంస్థ కార్యాలయంలో పట్టణ వీధి వ్యాపారుల కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రధాన రద్దీ రోడ్లలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారని, వారికి ఇబ్బందులకు లేకుండా ఆయా రహదారులను రెడ్ జోన్‌లుగా గుర్తిస్తున్నామన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న హాకర్లు పక్క వీధుల్లో సర్దుకోవాలని ఆదేశించారు. అంబర్ జోన్లుగా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఉదయం 5 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు నియమిత కాలంలో వీధి విక్రయాలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. వీధి విక్రయదారులు తమ సమస్యలపై సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. ఈ సందర్భంగా వీధి విక్రయదారుల సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ దుకాణాలు తొలగించిన వారికి వేరే ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలని, ఐడి కార్డులు అందజేస్తే ముద్ర పథకం కింద రుణాలు పొందే అవకాశం ఉందన్నారు. ఆదివారం రోజున నిర్వహించే మార్కెట్ అరండల్‌పేట ప్రధాన రహదారిలో నిర్వహిస్తున్నందున ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉందని ట్రాఫిక్ డిఎస్‌పి తెలియజేయగా, ప్రత్యామ్నాయంగా పిచుకల గుంటలో ఆదివారం మార్కెట్‌ను నిర్వహించుకుంటామని తెలిపారు. ఆర్టీసి కాంప్లెక్స్ ప్రాంతంలో పుట్‌పాత్‌లు ఏర్పాటు చేస్తే ఫుట్‌పాత్ లోపల విక్రయదారులను అనుమతిస్తామని, తద్వారా ట్రాఫిక్ క్రమబద్దీకరించవచ్చునని సిఐ సూచించారు. కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఐడి కార్డులు ఇవ్వటానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని డిసిపి, పిఓలను ఆదేశించారు. ఒక్కొక్కరికి ఒక్క బండి మాత్రమే అనుమతిస్తామని, ఎక్కువ బండ్లు ఉన్నపక్షంలో వాటిని తొలిగిస్తామన్నారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ డిఎస్‌పి శ్రీనివాసులు, సిటీ ప్లానర్ ధనుంజయరెడ్డి, బిల్డర్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతిరావు, బ్యాంక్ మేనేజర్లు పున్నారావు, పరమేశ్వరరావు, వర్తక నాయకులు శివనాగమల్లేశ్వరరావు, నరసింహరావు, సిలార్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్, బైక్ ఢీకొని మహిళ మృతి
దుర్గి, మార్చి 29: ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా ఒక యువకుడికి తీవ్రగాయాలైన సంఘటన మండల కేంద్రమైన దుర్గి గ్రామ శివారులోని కిచ్చన్న కుంట వద్ద చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దుర్గి గ్రామానికి చెందిన నిమ్మ జ్యోతి కుమార్తె కామా పద్మ (20)కు ఐదు సంవత్సరాల కిందట వినుకొండ మండలానికి చెందిన రామాంజీతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు విలేష్. కొంతకాలం నుండి భార్యా, భర్తలకు గొడవలు రావడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో పద్మా హైదరాబాద్‌ని ఒక ప్రైవేట్ వైద్యశాలలో నర్స్‌గా చేస్తోంది. అయితే తల్లి దగ్గరున్న కుమారుడిని చూసేందుకు వచ్చిన పద్మ తిరిగి మంగళవారం హైదరాబాద్‌కు వెళ్ళేందుకు తన పిన్నాన్న కొడుకు శివ మాచర్ల నుండి హైదరాబాద్ వెళ్ళే బస్సును ఎక్కించేందుకు దుర్గి నుండి బైక్‌పై మాచర్లకు బయలుదేరారు. మార్గం మధ్యంలో ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. శివకు స్వల్ప గాయాలయ్యాయి. శివ వెంటనే దుర్గి ఎస్‌ఐకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ జి సుబ్బారావు పరిశీలించారు. మృతురాలు తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు.