గుంటూరు

కాంగ్రెస్‌తోనే అన్నివర్గాల అభ్యున్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 30: అన్నివర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావు పేర్కొన్నారు. బుధవారం గుంటూరు నగరానికి విచ్చేసిన సామాజిక న్యాయసాధికారత బస్సుయాత్రకు కార్యకర్తలతో కలిసి స్వాగతం పలికారు. యాత్ర బిఆర్ స్టేడియం నుండి లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అక్కడ జరిగిన బహిరంగ సభలో మక్కెన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తూ పాలన కొనసాగిస్తున్నాయన్నారు. మోదీ అధికారంలోకి రాగానే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని స్వదేశానికి తెస్తామని చెప్పిన హామీ నేటికీ అమలు కాలేదన్నారు. బస్సుయాత్ర ముగింపు సభ ఏప్రిల్ 20వ తేదీన స్థానిక వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ కొరివి వినయ్‌కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అణగారిన వర్గాల హక్కులను కాలరాస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్టమ్రంత్రి వర్గంలో గిరిజనులకు స్థానం కల్పించక పోవడం ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి అద్దం పడుతోందన్నారు. రాష్ట్రంలో పాలక ప్రతిపక్షాలు అన్నిరంగాల్లో ఘోరంగా విఫలమయ్యాయన్నారు. మైనార్టీ సెల్ రాష్ట్ర చైర్మన్ ఆలీ ఖాన్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాడేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. కేంద్రపాలన పట్ల ప్రజలు అసహనానికి లోనవుతున్నారన్నారు. లౌకిక వాదాన్ని కాపాడటంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఎస్టీ సెల్ చైర్మన్ కాండ్రు సుధాకర్, బిసి సెల్ రాష్ట్ర చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1959లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పాలకులదేనన్నారు. 2006లో అటవీ హక్కుల చట్టం ద్వారా భూమిలేని గిరిజనులకు భూములు పంపిణీ చేశామన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు చేసిన ఘనత కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. నగర పార్టీ అధ్యక్షుడు మాదా వెంకట ముత్యాలరావు, పిసిసి కార్యదర్శులు వణుకూరి శ్రీనివాసరెడ్డి, ఈరి రాజశేఖర్, అధికార ప్రతినిధి కూచిపూడి సాంబశివరావు రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్, కలెక్టరేట్‌లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మొగిలి శివకుమార్, సవరం రోహిత్, నూనె పవన్‌తేజ, షేక్ జిలాని, శృంగారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.