బిజినెస్

హెచ్‌జెడ్‌ఎల్ వాటా విక్రయం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: వేదాంత రిసోర్సెస్ అధీనంలోని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్)లోగల ప్రభుత్వ వాటాను విక్రయించడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం దేశీయ లోహ ఉత్పత్తి రంగంలో ఉన్న పరిశ్రమల్లో ప్రభుత్వానికి వాటా ఉన్నది కేవలం హెచ్‌జెడ్‌ఎల్‌లోనేనని గుర్తుచేసింది. కాబట్టి ఈ విషయంలో కొంత వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 2002-03 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌జెడ్‌ఎల్‌లో 64.92 శాతం వాటాను ఎన్నారై బిలియనీర్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలోగల వేదాంత రిసోర్సెస్‌కు కేంద్ర ప్రభుత్వం విక్రయించింది. ప్రభుత్వానికి ఉన్న మిగతా వాటా 29.54 శాతాన్ని కూడా 2012లో 2.57 బిలియన్ డాలర్లతో కొనేందుకు అగర్వాల్ ముందుకొచ్చారు.
ఇదిలావుంటే ఇటీవల భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు సైతం హెచ్‌జెడ్‌ఎల్‌లో ప్రభుత్వ వాటా విక్రయానికి అడ్డు చెప్పడం తెలిసిందే.