భక్తి కథలు

హరివంశం 122

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీడు అవధ్యుడు. దేవతాదత్తుడైన వరగర్వితుడు. వీణ్ణి జయించి చంపటం అసాధ్యం. శత శత సంవత్సరాలకైనా అది నెరవేరదు. అయితే నీకంటికింపు మంటలకు కాలిపోయినాడు. వీడి పేరు కాలయవనుడు. నీవేమో త్రేతాయుగానికి చెందినవాడవు మహానుభావా! ఇది ఇపుడు కలియుగం ప్రవేశించబోతున్న కాలం అని చెప్పాడు కృష్ణుడు.
అపుడు ముచికుంద మహారాజు గుహ బయటకు వచ్చి లోకాన్ని ఒక్కసారి చూశాడు. అల్పవీర్యులు, అల్పోత్సాహులు, అల్ప ప్రమాణ దేహులు అయిన జనుల చేత క్రిక్కిరిసిపోయి ఉండటం ఆయన భూమిమీద చూశాడు. తన వంశంలో చాలా తరాలు గడిచిపోవటం కూడా గమనించాడు.
రాజ్యభోగాలమీద కోరిక ఆయనకు ఉడిగిపోయింది. పురుషోత్తమా! తపస్సు చేసుకుంటానని చెప్పి హిమాలయ పర్వత గుహలనుద్దేశించి వెళ్లిపోయినాడు ముచికుంద మహారాజు. ఆ గరుడ ధ్వజ సుందరుడు అటు తర్వాత యుద్ధ రంగంలో ప్రవేశించాడు. దివ్యాయుధ విదారణంతో కాలయవనుడి సైన్యాన్ని చీల్చి చెండాడు. అందులో ముఖ్య వీరులను పరిమార్చాడు. వాళ్ళ చతురంగ బలాలను వశం చేసకున్నాడు. ఆ మహావిభవంతో ఆయన తన వారి దగ్గరకు వచ్చాడు. యాదవులంతా ఆయనను ఎంతగానో ప్రస్తుతించారు. ఇక్కడ ద్వారవతి అనే పేరుతో గొప్ప నగరం నెలకొనబోతున్నది కదా! మీరు మీరు మీ ఇళ్ళు వాకిళ్ళు నిర్మించుకోవటానికి ఆయత్తంకండి. మీకు ఇష్టమైన చోటులు ఎంచుకోండి. ఈ మహానగరానికి నాలుగు వాకిళ్ళుంటాయి. ఈ నాలుగు ద్వారాలను చంద్రుడు, అగ్ని, వరుణుడు, ఇంద్రుడు అధిదేవతలై కాపాడుతుంటారు.
అతి విస్తీర్ణమైన రాజ మార్గాలుండాలి ఈ నగరంలో. బ్రహ్మ విష్ణు శంకర ప్రముఖ దేవతాలయాలు నిర్మించుకోవాలి మనం. చైత్య గృహాలుండాలి. సుందరమైన చలివేంద్రాలుండాలి. రాజభవనం పరమ విభవ శోభా సుందరంగా నిర్మించాలి అని శిల్పాచార్యులను నియమించాడు కృష్ణుడు. శుభముహూర్తం తానే నిర్ణయించాడు. వాస్తుపూజ, బలి హోమ తంత్రాలన్నీ నిర్వాహం చేశాడు. శిల్పాచార్యులెందరో వచ్చి ఆ పనిలో ప్రవేశించారు. కృష్ణుడాశించిన వేగంతో రాజధానీ నగర నిర్మాణం పనులు సాగకపోవటం చూసి పని తొందరగా పూర్తిచేయాలి కదా అనుకొని విశ్వకర్మను తలచుకొన్నాడు.
విశ్వకర్మ బ్రహ్మమానస పుత్రుడు. దేవశిల్పి. లోకంలో మహాదేవతా సౌధాలు, రాజభవనాలు, అద్భుతమైన పట్టణాలు, లోకోత్తర ప్రసిద్ధమైన సభా భవనాలు నిర్మించినవాడు. ఆయన వెంటనే కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. దేవా! నన్ను ఇంద్రుడు పంపించాడు. వెంటనే నీ ఆజ్ఞ నెరవేర్చవలసిందని చెప్పాడు. నాకు ఆ ఇంద్రుడు, విశే్వశ్వరుడైన ఫాలాక్షుడు ఏ విధంగా పూజార్హులో, అర్చితులో నీవు కూడా అటువంటివాడివే! ‘ఏమిటి నీ అనుజ్ఞ!’ అని దోసిలొగ్గి అడిగాడు. ఇక్కడ మాకు అద్భుతమైన ఒక నగరం నిర్మించటమే నా కోరిక అని విశ్వకర్మకు చెప్పాడు కృష్ణుడు. అది లోకంలో సాటి లేని నగరం అనిపించుకోవాలి.
అమర లోకంలో ఇంద్రుడి అమరావతికి సాటి వచ్చేట్లుండాలి. నీ శిల్ప విద్య అంతా ఇక్కడ దీపితం కావాలి అని కూడా విశ్వకర్మను ప్రోత్సహించాడు కృష్ణచంద్రుడు. మూడు లోకాలూ ఆశ్చర్యపడాలి అని కూడా చెప్పాడు.
విశ్వకర్మ ఆ ప్రాంతాన్ని పరిశీలించాడు. అక్కడి జనం సంఖ్య చూశాడు శ్రీకృష్ణుడి మనోభావాలు గ్రహించాడు. స్వామీ! నీవు కోరిన విధంగా అందమైన, మూడు లోకాలలోనూ దీనికి సాటి రాగల పట్టణం నిర్మించగలను.

ఇంకాఉంది

- అక్కిరాజు రమాపతిరావు