భక్తి కథలు

హరివంశం 189

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మహాదనుజుడి అశేష సైన్యాన్ని దూదిపింజలలాగా తన బాణ కౌశలంతో చెల్లాచెదరుచేశాడు. అనిరుద్ధుణ్ణి ఎవరూ బంధించలేకపోయినారు! అసలీ పోరు ఎట్లా సంభవించిందో చెపుతా వినండి. బాణాసురుడికి ఒక చక్కని చుక్క ఉష అనే కూతురుంది. ఆ ఉష కృష్ణుడి మనవడిపై మనసుపడింది. అదంతా ఒక కథ. ఉష చెలికత్తె చిత్రరేఖ మాయా విద్యా ప్రవీణురాలు. ద్వారకకు వచ్చి ఉషానిరుద్ధులు పరస్పర ప్రేమబద్ధులై ఉన్నారని అనిరుద్ధుడి ద్వారా కూడా తెలుసుకుని, అనిరుద్ధుణ్ణి తన ఐంద్రజాలం ప్రదర్శించి ఉష దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ బాలకుణ్ణి అప్పగించింది. వాళ్ళిద్దరూ అభ్యంతర మందిరంలో సుఖ సంతోషాలతో కాలం గడుపుతుండగా అంతఃపుర కావలి స్ర్తిలు చూసి ఈ విషయం బాణుడికి చెప్పారు. బాణుడు చాలా చిన్నపుచ్చుకున్నాడు. తనకిది గొప్ప పరాభవంగా భావించాడు. అనిరుద్ధుణ్ణి పట్టి బంధించి తన వద్ద హాజరుపరచవలసిందిగా తన రక్కసి మూకలను పంపించాడు. అనిరుద్ధుడి ధాటికి ఆగలేక వారంతా పరుగులు తీశారు. ఇంకా పెద్ద సైన్యాన్నీ, ముఖ్య దళాధిపతులను పంపించినా వాళ్ళందరికీ శృంగభంగమైంది. అప్పుడు బాణుడే స్వయంగా అనిరుద్ధుణ్ణి బంధించి చెరలో ఉంచాలనీ, శిక్షించాలనీ ప్రచండమైన సేనా పరివారంతో వచ్చాడు. అనిరుద్ధుడి రణ విజృంభణకు బాణుడు కూడా తలకిందులైపోయినాడు. ఇక అతణ్ణి లొంగదీసుకోవటం అసంభవం అని గ్రహించి బాణాసురుడు మీ అనిరుద్ధుణ్ణి మాయాయుద్ధంలో నాగపాశాలతో బంధింపజేశాడు. నేను వెళ్ళి కృష్ణపౌత్రుడికి ధైర్యం చెప్పాను. మీ తాతగారికి తెలిస్తే బాణుడికి మూడినట్లే అని అనిరుద్ధుడికి వంతదీర్చి నేను హుటాహుటిన మీ చెవిని వేయటానికి ఇక్కడకు వచ్చాను. ఇంతకూ మీకు తెలియచేయవలసిన విషయం ఏమంటే బాణాసురుడి శోణపురంలో అనిరుద్ధుడు బందీకృతుడై ఉన్నాడని. ఇక మీ ఇష్టం. మీరు మీ అనిరుద్ధుణ్ణి విడిపించుకొనే ప్రయత్నం ఎట్లా చేస్తారో ఆలోచిచండి! మీరు ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదు. శోణపురం ఇక్కడకు పదకొండు వేల యోజనాల దూరంలో వుంది. రథాలు, అశ్వాలు అంటే లాభం లేదు. గరుడుడి మూపుపై వెంటనే బయలుదేరవయ్యా పరమ పురుషా! మహానుభావా! ఆర్తత్రాణ పరాయణా! లోకంలో ఎవరికి ఏ ఆపద కలిగినా రక్షిస్తావు కదా నీవు. నీ మనవడే ఇప్పుడు ఆపదలో చిక్కుకున్నాడు స్వామీ! అని నాటక ధోరణిలో చెప్పి నిష్క్రమించాడు.
వెంటనే శ్రీకృష్ణుడు సుపర్ణుణ్ణి మనసులో తలచుకున్నాడు. వైనతేయుడు మనోజవంతో ఆయన ముందు వ్రాలాడు. వినతాసుతుణ్ణి ఉత్సాహపరచటానికి శ్రీకృష్ణుడు అతడి తేజస్సు, బలమూ, పరాక్రమమూ, ఖగేంద్ర పదవీ ప్రశంసించాడు. నీవు నాకు తమ్ముడి వంటివాడవన్నాడు. నీవు వేదస్తుత్యుడివి అని మెచ్చుకున్నాడు. నీ తల్లి దాస్యాన్ని తొలగించటానికి ఇంద్రుణ్ణే తృణీకరించి అమృతభాండాన్ని తీసుకొనివచ్చావు. రెక్కలున్న మేరు పర్వతం వంటివాడివి నువ్వు.
అప్పుడు గరుత్మంతుడు తన ప్రభువు తనను పొగడటానికి సమ్మతించలేదు. ఇదేమిటి? ఎప్పుడూ లేదు నీవు నన్నిట్లా పొగడటం. నామీద నీకున్న అగ్గలమైన ప్రేమాభిమానాలవల్ల నన్నిట్లా పెద్ద చేస్తున్నావు. ఈరేడు లోకాలలో పరమ పురుషా! నీ పొగడ్తలు పొందే భాగ్యం నాకొక్కడికే దక్కింది. నీవు నిఖిల సురాసురేశ్వరుడవు. భక్తవాంఛాప్రదుడివి. సకల యజ్ఞప్రవర్తకుడివి. అనేకావతారాలు ఎత్తావు నీవు నీ భక్తులను రక్షించటానికి. లోకాలను కాపాడటానికి. సకల రాక్షస సంహారానికి ఇప్పుడు దేవకీ దేవికీ వసుదేవుడికీ పట్టివై పుట్టావు. కొండ గొడుగుగా గోవులను, గోపాలురను, గోపల్లెను కాచి రక్షించావు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు